ఫుడ్ డెలివరీ లో పొరపాటుకు 55 వేలు చెల్లించాల్సి వచ్చింది

ఫుడ్ డెలివరీ లో సంచలనం సృష్టించాలి అని భావిస్తూ ఫుడ్ డెలివరీ లో జొమాటో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.అయితే ఒక డెలివరీ విషయంలో జొమాటో చేసిన పొరపాటుకు కన్స్యూమర్ కోర్టు షాక్ ఇచ్చింది.

 Pune Eatery Fined Rs 55000 For Serving Chicken Instead Of Paneer Zomato Food De-TeluguStop.com

నిర్లక్ష్యంగా వ్యవహరించి పన్నీర్ స్థానం లో చికెన్ పంపి కస్టమర్ ని ఇబ్బంది పెట్టినందుకు జొమాటోతో పాటు సర్వ్ చేసిన హోటల్ కి భారీ జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.పుణెకు చెందిన ఓ న్యాయవాది జొమాటో యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో పన్నీరు బట్టర్‌ మసాలా ఆర్డర్ చేశారు.

అయితే పన్నీర్ బట్టర్‌ మసాలా స్థానంలో బట్టర్‌ చికెన్‌ను సర్వ్‌ చేయడం తో పన్నీర్ అని భావించిన ఆయన నాన్‌వెజ్‌ను తినేశారు.అయితే ఆ తర్వాత అది చికెన్‌ అని గుర్తించి షాక్ తిన్న ఆయన సీరియస్‌గా తీసుకుని జొమాటోతో పాటు ఆ హాటల్‌పై వినియోగదారుల కోర్టులో పిటిషన్‌ వేశారు.

ఫుడ్ డెలివరీ లో పొరపాటుకు 55 వే

విచారణ చేపట్టిన కోర్టు.శాఖాహారానికి బదులుగా మాంసాహారాన్ని సర్వ్‌ చేసినందుకు జొమాటోతో పాటు ఆ హోటల్‌కు రూ.55 వేల జరిమానా విధించింది.45 రోజుల్లోగా జరిమానా కట్టాలని ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది.ఇందులో తమ తప్పు ఏమీ లేదని జొమాటో కోర్టులో వాదించింది.కాగా, తప్పు చేసింది హోటల్ ఏ అయినా అందులో ఇద్దరికీ సమాన భాగస్వామ్యం ఉందని చెప్పి,రూ.50వేలు ఫైన్ కట్టడంతో పాటు శాకాహారి అయిన లాయర్ చికిన్ తినేలా చేసినందుకు మరో రూ.5వేలు ఇవ్వాలని చెప్పింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube