ఆధారాలు ఉన్నాయి...కరోనా వూహాన్ ల్యాబ్ లోనే పుట్టింది..భారత శాస్త్రవేత్తల సంచలన ప్రకటన..!!!

కరోనా మహమ్మారి పుట్టుకపై మొదటి నుంచీ ప్రపంచ దేశాలన్నీ చైనా వైపే వేలెత్తి చూపిస్తున్నా చైనా మాత్రం అందుకు అంగీకారం తెలుపలేదు సరికదా ఇదంతా చైనాను పై చల్లుతున్న బురద అంటూ ఎదురు దాడికి దిగేది.అమెరికా అంటువ్యాధుల నిపుణులు ఆంటోని ఫౌచీ కుడా చివరికి చైనాను వెనుకేసుకొచ్చిన సందర్భాలు లేకపోలేదు.

 Pune Scientists Couple Linked Covid-19 Origin With Wuhan Lab, Wuhan Lab, Covid-1-TeluguStop.com

అయితే ఫౌచీ కి చైనాకు మధ్య మంచి సంభంధాలు ఉన్నాయని కరోనా వూహాన్ ల్యాబ్ నుంచీ వచ్చిందన్న విషయం ముందే తెలుసనీ, గతంలో కోట్లాది డాలర్లు చైనాకు పరిశోధనల నిమ్మిత్తం ఫౌచీ తరలించారని అమెరికా రిపబ్లికన్ సెనేటర్ ఆరోపించారు అందుకు సంభందించిన కొన్ని ఈ మెయిల్స్ కూడా బయట పడ్డాయి.అయితే తాజాగా

పుణెకు చెందిన భార్యా భర్తలు కరోనా మహమ్మారి వూహాన్ ల్యాబ్ నుంచీ పుట్టిందని అందుకు తగ్గ ఆధారాలు తమవద్ద ఉన్నాయని సంచలన ప్రకటన చేశారు.

డాక్టర్.మోనాలీ రహల్కర్, డాక్టర్ రాహుల్ బహులికర్ ఇద్దరూ భార్యాభర్తలు.

కరోనా పుట్టుకపై పరిశోధనలు చేసిన తరువాత కరోనా పుట్టుకపై ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకున్నామని ఒక ఇంటర్వూలో తెలిపారు.గతంలో తాము సార్స్ కరోనా వైరస్ -2 లక్షణాలు ఉన్న ఆర్ఏటీ -13 పరిశోధనలు చేసామని .చైనాలోని ఓ రాగి గనిలో కొన్ని డాక్యుమెంట్లు కూడా తాము 2012 లో కనిపెట్టామని ఆ గుహలో అప్పట్లో ఆరుగురు కార్మికులు పనిచేశారని వారి పనిచేస్తున్న సమయంలో దారుణమైన వాసన రావడం, గబ్బిలాల వ్యర్దాలతో గుహ నిండి పోయిందని ఈ క్రమంలో వారిలో ముగ్గురు తెలియని వ్యాధితో చనిపోగా మరో ముగ్గురికి ఇప్పుడు కరోనాకు ఇస్తున్న యాంటీ బాడీస్ మందునే ఇచ్చి నయం చేశారని ఇవన్నీ తమ పరిశోధనలో తెలినట్టుగా ప్రకటించారు.

-Telugu NRI

సదరు గని నుంచీ తాము సేకరించిన వైరస్ ను పరిశోధించి ఓ డాక్యుమెంట్ ప్రచురించగా ట్విట్టర్ లోని ఓ వ్యక్తి తమ అభిప్రాయాలతో ఏకీభవించాడని వారు తెలిపారు.అప్పట్లో అస్వస్థకు లోనైన ముగ్గురి కార్మికుల స్కాన్, బ్లడ్ రిపోర్ట్ లు పరిశీలించామని ఇప్పుడు కరోనా రోగులకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయో అప్పట్లో వారికి కుడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయని, ఇప్పుడు ఇస్తున్న ట్రీట్మెంట్ అప్పట్లో వారికి కూడా ఇచ్చారని, ఈ తరుణంలోనే వూహాన్ ల్యాబ్ లో విస్తృతమైన పరిశోధనలు జరిగాయని ఈ కారణంతోనే వైరస్ వ్యాప్తి జరిగిందని తేల్చి చెప్పారు.ఎలాంటి ఆధారాలు కావాలన్నా తమ వద్ద ఉన్నాయని ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube