పునర్నవి భూపాలం… ఈ పేరు టాలీవుడ్ లో ప్రస్తుతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అప్పుడెప్పుడో ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ అప్పుడప్పుడు హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ వచ్చింది.
అయితే బిగ్ బాస్ ఆమె ఇమేజ్ ని ఒక్కసారిగా మార్చేసింది.సీజన్ 3 బిగ్ బాస్ లో ఈ భామ ఎంట్రీ ఇచ్చి అక్కడ సందడి చేసి తెలుగు ప్రేక్షకులు అందరికి చేరువ అయిపొయింది.
రియాలిటీ షోలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో నడిపిన లవ్ ట్రాక్ ని తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు.నిజంగానే వారి మధ్య ప్రేమ ఉందనే విధంగా నమ్మేశారు.
ఈ నేపధ్యంలో బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత వారిద్దరు కలిసి కనిపించిన, ఏ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చాట్ చేసిన పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అంటూ కామెంట్స్ చేసేవారు.అయితే తాము మంచి స్నేహితులం మాత్రమే అని తమ మధ్య ప్రేమ లేదని వారిద్దరు క్లారిటీ ఇచ్చేసారు.
ఇదిలా ఉంటే బిగ్ బాస్ తో వచ్చిన ఇమేజ్ ని మరింత డబుల్ చేసుకోవడానికి పునర్నవి ఈ మధ్య కాస్తా గ్లామర్ డోస్ పెంచింది.ఫోటో షూట్ లతో తనలోని హాట్ లుక్స్ ని పరిచయం చేస్తూ దర్శకులకి బాణాలు విసురుతుంది.
ఈమె హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో భాగా వైరల్ అవుతున్నాయి.తాజాగా మరోసారి బోల్డ్ ఫోటోషూట్ తో ఈ అమ్మడు రెచ్చిపోయింది.ఈ ఫోటోలపై నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు.మరి ఈ గ్లామర్ షోతో పునర్నవి ఎంత వరకు అవకాశాలు సొంతం చేసుకుంటుంది అనేది వేచి చూడాలి.