వారి ట్రోల్స్‌తో బాధపడి సోషల్‌ మీడియాను వదిలేసిన పున్నూ

సోషల్‌ మీడియాలో సెలబ్రెటీలను టార్గెట్‌ చేసి విమర్శలు చేయడం చాలా కామన్‌ విషయం.సోషల్‌ మీడియాలో సినిమా స్టార్స్‌ ఏ విషయం గురించి స్పందించినా కూడా కొందరు దాన్ని రాద్దాంతం చేసేందుకు ప్రయత్నిస్తారు.

 Punarnavi Bhupalam,instagram, Trolls, Social Media, Bios Lockers Room-TeluguStop.com

వారి దృష్టిలో పడాలని కొందరు, మరికొందరు విమర్శనాత్మక దోరణి.ఈ దోరణితో చాలా మంది సెలబ్రెటీలు గతంలో ఇబ్బంది పడ్డారు.

తాజాగా బిగ్‌ బాస్‌ బ్యూటీ పునర్నవి భూపాలం కూడా చిరాకును ఎదుర్కొంది.ఆ చిరాకుతో ఏకంగా ఇన్‌ స్టాగ్రామ్‌కు కొన్నాళ్లు దూరంగా ఉండాలని ఆమె ఫిక్స్‌ అయ్యింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.కొన్ని రోజుల క్రితం దిల్లీలో కొందరు యువకులు బోయిస్‌ లాకర్స్‌ రూమ్‌ పేరుతో ఒక సోషల్‌ మీడియా గ్రూప్‌ పేరుతో చేస్తున్న వికృత చేష్టలు బయట పడ్డాయి.

అమ్మాయిల గురించి ఆ గ్రూప్‌లో తప్పుగా మాట్లాడుకోవడంతో పాటు అశ్లీల వీడియోలు మరియు ఫొటోలు షేర్‌ చేస్తున్నారు.ఆ విషయం బయటకు రావడంతో పోలీసులు గ్రూప్‌ అడ్మిన్స్‌ను అరెస్ట్‌ చేయడం జరిగింది.

ఆ సంఘటనపై పలువురు సెలబ్రెటీలు తమ అభిప్రాయంను తెలియజేశారు.

Telugu Bios Lockers, Trolls-

పునర్నవి కూడా ఆ విషయమై స్పందిస్తూ తల్లిదండ్రులు సరిగా పెంచక పోవడం వల్లే ఇలాంటి పనులు జరుగుతున్నాయంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ పెట్టుకుంది.ఆ బాయ్స్‌ చేసిన పనికి తల్లిదండ్రులను నింధించడంపై కొందరు విమర్శలు వ్యక్తం చేశారు.తల్లిదండ్రులను విమర్శించడం ఫ్యాషన్‌ అయ్యింది.

పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే అనుకుంటారు తప్ప ఎవరు కూడా వారి జీవితాలను నాశనం చేయాలనుకోరు అంటూ పున్ను పోస్ట్‌కు చాలా మంది రియాక్ట్‌ అయ్యారు.

తనను ట్రోల్స్‌ చేస్తున్న వారికి సమాధానంగా తాను ఎవరిని కించ పర్చే ఉద్దేశ్యంతో ఆ పోస్ట్‌ పెట్టలేదు.

ఆ విషయాన్ని ఇంతగా రాద్దాతం చేయడం విడ్డూరంగా ఉంది.ఇలాంటివి ఫేస్‌ చేయాల్సి వస్తున్నందుకు నేను కొన్నాళ్లు ఇన్‌స్టాకు దూరంగా ఉంటానంటూ ప్రకటించింది.

పున్ను కొన్నాళ్ల పాటు సోషల్‌ మీడియాలో కనిపించక పోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube