నేను హీరోయిన్ ని వాళ్ళతో నన్ను పోల్చకండంటున్న పున్ను బేబీ...  

Punarnavi Bhupalam React About Her Fans Comments - Telugu Punarnavi Bhupalam, Punarnavi Bhupalam Latest News, Punarnavi Bhupalam Movie News, Punarnavi Bhupalam News, Rashmi Gautham, Sudigali Sudheer, Tollywood

రాజ్ తరుణ్ నటించినటువంటి ఉయ్యాల జంపాల చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి పునర్నవి భూపాలం గురించి పెద్దగా తెలియని వారుండరు.అయితే ఆ సినిమా బాగానే హిట్ అయిన ప్పటికీ పునర్నవి కి మాత్రం పేరు, ప్రఖ్యాతలు రాలేదు.

Punarnavi Bhupalam React About Her Fans Comments - Telugu Punarnavi Bhupalam, Punarnavi Bhupalam Latest News, Punarnavi Bhupalam Movie News, Punarnavi Bhupalam News, Rashmi Gautham, Sudigali Sudheer, Tollywood-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఆ తర్వాత శర్వానంద్ నటించినటువంటి మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రంలో చేసినటువంటి సపోర్టింగ్ రోల్  తో కొంత మేర గుర్తింపు తెచ్చుకుంది.ఆ తరువాత పిట్టగోడ, మనసుకు నచ్చింది, ఎందుకో ఏమో, తదితర చిత్రాల్లో నటించినప్పటికీ ఈ చిత్రాలు కూడా పునర్ణవి కి పెద్దగా కలిసి రాలేదు.

అయితే ఇటీవల కాలంలో ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 3 రియాల్టీ షోలో పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ షోలో పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్ మధ్య ప్రేమాయణం నడుస్తుందని అప్పట్లో పలు కథనాలు వినిపించాయి.

దీంతో పలువురు పునర్నవి అభిమానులు పునర్నవి మరియు రాహుల్ సిప్లిగంజ్ ల జోడి, బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి రష్మి, సుడిగాలి సుదీర్ ల జోడిని పోలి ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.అంతేకాక ప్రస్తుతం  యాంకర్ రష్మీ సుడిగాలి సుదీర్ కలిసి వ్యాఖ్యాతలుగా నటిస్తున్నటువంటి “డీ” జోడి సౌతిండియాలోనే నెంబర్ వన్ డాన్స్ షో గా దూసుకుపోతుంది.

దీంతో పునర్నవి అభిమానులు కూడా తాను మరియు రాహుల్ సిప్లిగంజ్ కలిసి ఓ షోలో నటించవచ్చు కదా అంటూ సలహాలు ఇస్తున్నారు.

తాజాగా ఈ విషయంపై పునర్నవి భూపాలం స్పందించింది.ఇందులోభాగంగా ఇప్పటికే తాను పలు చిత్రాల్లో నటించానని, అలాగే తాజాగా మరికొన్ని చిత్రాల్లో కూడా నటిస్తున్నానని అన్నారు.అలాగే తాను సినిమా హీరోయిన్ నని, దయచేసి నన్ను , రాహుల్ ని  రష్మీ సుధీర్ లతో  పోల్చకండి అంటోంది ఈ అమ్మడు.

అంతేగాక తనకు యాంకరింగ్ అంటే పెద్దగా ఇష్టం ఉండదని అలాంటి ఆలోచన కూడా లేదని అన్నారు.

తాజా వార్తలు