ఆ బ్లాకీ గాడిని నేను లవ్‌ చేయడం ఏంటీ?

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ఫాలో అయ్యే వారు అంతా కూడా ఖచ్చితంగా పునర్నవి మరియు రాహుల్‌లు ప్రేమలో ఉన్నట్లుగా భావిస్తుంటారు.వారిద్దరు ఎంత క్లోజ్‌ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 Punarnavi About Relationship With Rahul-TeluguStop.com

మొదట రాహుల్‌ ఎలిమినేట్‌ అన్నప్పుడు పునర్నవి కళ్లలో నీళ్లు చూశాం.ఆ తర్వాత రాహుల్‌ తిరిగి ఇంట్లోకి వచ్చిన సమయంలో హడావుడి మామూలుగా లేదు.

పునర్నవి సంతోషం అంతా ఇంతా కాదు.ఇక మొన్న పున్ను వెళ్తుంటే రాహుల్‌ పెట్టుకున్న కన్నీళ్లు ఏ స్థాయిలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయో తెల్సిందే.

రాహుల్‌ మరియు పున్నుల మద్య ప్రేమ చాలా డీప్‌గా ఉంది.ఇద్దరు కూడా పీకల్లొతు ప్రేమలో ఉన్నట్లుగా భావిస్తున్నారు.అయితే తాజాగా ఒక జాతీయ మీడియా సంస్థ పున్నును ఇంటర్వ్యూ చేసింది.ఆ సందర్బంగా మీరు రాహుల్‌తో ప్రేమలో ఉన్నట్లుగా అంతా భావిస్తున్నారు.

దానికి మీ సమాధానం ఏంటీ అంటూ ప్రశ్నించిన సమయంలో గట్టిగా నవ్వేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరికి షాక్‌ ఇచ్చింది.

Telugu Big Boss Telugu, Friend Ship, Love, Rahul-

 

ఆ బ్లాకీ గాడితో నాకు ప్రేమ ఏంటీ అంటూ నవ్వుతూ రాహుల్‌ నాకు మంచి స్నేహితుడు మాత్రమే.బిగ్‌బాస్‌లో తాను అందరికంటే ఎక్కువగా అభిమానించిన వ్యక్తి, నాకు మంచి స్నేహితుడు రాహుల్‌ అంటూ పున్ను వ్యాఖ్యలు చేసింది.ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇంట్లో ఉన్నన్ని రోజులు అతడితో చాలా క్లోజ్‌గా ఉన్న పున్ను బయటకు వచ్చిన వెంటనే స్నేహితుడు అనేసింది.స్నేహితుడు అయితే మరీ అంతలా ఉండాల్సిన అవసరం ఏంటో అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube