గొయ్యిలో దాక్కున్న అడవి పందిని బయటకు లాగి మరి.. చిరుత వేటా.. మజాకా..

అడవిలో ఉండే క్రూర జంతువుల వేట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.క్రూర జంతువులు భీకర పోరు జరిపి తమ ఆహారాన్ని తామే ఏర్పాటు చేసుకుంటాయి.

 Pull Out The Wild Boar Hiding In The Pit Leopard Hunting-TeluguStop.com

ఇక సాధు జంతువులు అయితే ఈ క్రూర జంతువుల కంట పడకుండా తమ జీవనాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుంటాయి.ఒకసారి వాటి కంటపడితే ఇక అంతే సంగతులు.

తమ ప్రాణాలు పోతాయంతే.క్రూర జంతువుల వేటకు సంబంధించిన వీడియోలు గతంలో సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి.

 Pull Out The Wild Boar Hiding In The Pit Leopard Hunting-గొయ్యిలో దాక్కున్న అడవి పందిని బయటకు లాగి మరి.. చిరుత వేటా.. మజాకా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా చిరుత వేటకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

సాధారణంగా నెట్టింట జంతువులకు సంబంధించిన యూనిక్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ క్షణాల్లోనే ట్రెండ్ అవుతుంటాయి.

ఇక క్రూర జంతువుల భీకర పోరాటాల వీడియో అయితే చాలు.అందరు వాటిని చూసి వైరల్ చేసే ప్రయత్నం చేస్తుంటారు.

ఈ క్రమంలోనే సింహం, పులి, చిరుత వేట వీడియోలు బోలెడు వైరల్ కాగా, తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో చిరుత క్షణాల్లోనే అడవి పందిని మట్టుబెట్టింది.ఎరను ఎంచుకున్నాక క్షణాల్లోనే అటాక్ చేసి తన సత్తా ఏంటో చూపించింది చిరుత.

సహజంగానే చిరుత వేట చాలా భయానకంగా ఉంటుంది.ఇక ఈ చిరుత ఈ సారి చాలా ఆకలి మీద ఉన్నట్లుంది.

దండయాత్ర చేసిన మాదిరిగానే క్షణాల్లోనే గొయ్యిలో దాక్కున్న అడవి పందిని బయటకు లాగి మరీ చంపేసింది.

వైరల్ అవుతున్న సదరు వీడియో చూస్తే మీకు చిరుత వేట ఎంత భీకరంగా ఉంటుందో ఇట్టే అర్థమైపోతుంది.అయితే, ఒకసారి జంతువును వేటాడాలని చిరుత డిసైడ్ అయిందంటే చాలు.కాన్సంట్రేషన్ మొత్తం దానిపైనే చేసి దానని తుదముట్టించగలదు.

అలా లక్ష్యాన్ని ఇట్టే చేరుకునే వేగం చిరుతకు ఉంది.చిరుత వేట నుంచి తప్పించుకునేందుకుగాను సాధు జంతువులు ప్రయత్నాలు చేస్తుంటాయి.

కానీ, ఎప్పుడో ఒకసారి రేర్‌గా మాత్రమే చిరుత ఎర నుంచి సాధు జంతువులు తప్పించుకోగలవు.

#Cheeta #Leopard #Wild Boar #Leopard #Animals

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు