పులిగుండాలని పర్యాటక కేంద్రం చేయాలి..!

పెనుబల్లి మండల కేంద్రం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాజెక్ట్ పులిగుండాల.చుట్టూ కొండలు.అడవి ప్రాంతంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పర్యాటకులను ఎంతగానే ఆకట్టుకుంటుంది.1990లో ఉమ్మడి ఆంధ్రప్రదేష్ లో నేదురుమల్లి జనార్ధన రెడ్డి సిఎంగా.జలగం ప్రసాదరావు పంచాతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని పరిశీలించి పులిగుండాల ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు.ఈ ప్రాజెక్టుతో పెనుబల్లి, కల్లూరు మండలాల్లో 700 ఎకరాలకు నీరు లభిస్తుంది.51 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ ప్రాజెక్ట్ వేసవిలో అటవీ వన్య ప్రాణులు దాహం తీర్చుకునేందుకు సహకరిస్తుంది.అయితే ఈమధ్య ఈ ప్రాజెక్టుకి సందర్శకులు ఎక్కువయ్యారు.

 Puligundala Project Tourist Center, Piligundala, Puligundala Project, Telangana,-TeluguStop.com

పర్యాటకులు వస్తున్నా కాని వారికి ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు.

ప్రాజెక్ట్ తో పాటుగా పురాతన శివాలయం కూడా ఇక్కడ ఉంది.

మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి.అయితే ప్రాజెక్ట్ వద్ద రక్షణ లేకపోవడం వల్ల ప్రమాదవశాత్తు మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి.

అయితే ఈ ప్రాజెక్టుని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దాలని స్థానికులు కోరుతున్నారు.పర్యాటక కేంద్రంగా చేసి సౌకర్యాలు కల్పించాలని అంటున్నారు.

పులిగుండాలని పర్యాటక కేంద్రంగా చేయాలని ఇప్పటికే పలువురు అధికారులను కోరినా ఎలాంటి కార్యరూపం దాల్చలేదు.అటవీ ప్రాంతంలో ఉండతంతో అటవీ అధికారులు జంతు ప్రదర్శానశల, పార్క్, టాయిలెట్స్ లాంటి సౌఅక్ర్యాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube