విరిగిపోయిన పులిచింతల ప్రాజెక్టు గేట్..!!

ఇటీవల వర్షాలు భారీగా కురవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నదులు డ్యాములు ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి.దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టుల వద్ద కు భారీగా వరద నీరు చేరుకుంటుంది.

 Pulichinthala Project Gate Broken-TeluguStop.com

ఇటువంటి తరుణంలో ప్రకాశం బ్యారేజి కి మరో ఎనిమిది గంటల్లో ఐదు లక్షల క్యూసెక్కుల ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉండటంతో … పులిచింతల ప్రాజెక్టు వద్ద 16వ నంబర్ గేటు ఎత్తుతున్న ప్రయత్నంలో ఒక్కసారిగా విరిగిపోవడం జరిగింది.దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన అధికారులు ప్రకాశం బ్యారేజి దిగువ ప్రాంత ప్రజలని అప్రమత్తం చేశారు.

ఇదే క్రమంలో పులిచింతల ప్రాజెక్టు వద్ద జరిగిన ఘటన పరిశీలించడానికి ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రావడం జరిగింది.ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో రెండడుగులు గేటు పైకి ఎత్తే ప్రయత్నంలో… గేటు విరగటం జరిగిందని మంత్రి దృష్టికి అధికారులు తీసుకొచ్చారు.దీంతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెంటనే ఎమర్జెన్సీ గేట్ ఏర్పాటు పై అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది.ఈ తరుణంలో ఎమర్జెన్సీ గేటు ఏర్పాటు చేయడం కోసం పోలవరం నుండి ఇంజనీర్లను రప్పించటానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 Pulichinthala Project Gate Broken-విరిగిపోయిన పులిచింతల ప్రాజెక్టు గేట్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం పులిచింతల నుండి 3 లక్షల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.దీంతో ప్రాజెక్టు దిగువ ఉన్న నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

#AP #Polavaram #AP #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు