జనసేనలో మరో కొత్త చేరిక ... పదవి  

Puli Shekhar Was Join In Janasena-

జనసేనలో ఒక్కొక్కరుగా వచ్చి చేరుతున్నారు. ఇప్పటికే అనేకమంది ప్రముఖులతో చర్చలు జరిపిన నేపథ్యంలో ఒక్కో నేతను చేర్చుకుంటూ… వారికి కీలక పదవులు ఇస్తూ… మిగతా పార్టీలకు పవన్ ఝలక్ ఇస్తున్నాడు. తాజాగా… పులి శేఖర్ అనే ప్రవాసాంధ్రుడిని చేర్చుకున్న పవన్ … అతడికి వెంటనే… జనసేన పార్టీ వ్యవహారాల కేంద్ర కమిటీ చైర్మన్ గా నియమించేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… ప్రవాసాంధ్రునిగా ఉన్న పులి శేఖర్‌ వందల కోట్ల రూపాయల విలువైన వ్యాపారాలు వదులుకుని మరీ జనసేనలో పని చేసేందుకు వచ్చారని పవన్‌ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. .

జనసేనలో మరో కొత్త చేరిక ... పదవి -Puli Shekhar Was Join In Janasena

ఆశాజ్యోతి పథకం ద్వారా ఏటా 5 వేల మందికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న సాఫ్ట్‌వేర్‌ సంస్థల నిర్వహకులు శేఖర్‌ అని జనసేన ఓ ప్రకటనలో తెలిపింది.మచిలీపట్నం నుంచి రెండు దశాబ్దాల కిందట ఆయన అమెరికా వెళ్లారని, ఆయన తాత నాయుడు నాగేశ్వరరావు స్వాతంత్య్ర సమరయోధులని పవన్ చెప్పుకొచ్చారు.