ఈ పవన్ హీరోయిన్ మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుందా...?

ఒక్కోసారి కొంతమంది హీరోయిన్లు చాలా కష్టపడి సినిమా పరిశ్రమకు వచ్చినప్పటికీ సినిమా పరిశ్రమలోని పరిస్థితులను తాళలేక ఎక్కువ కాలం కొనసాగలేకే పోతుంటారు.ఆ మధ్య టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు ప్రముఖ దర్శకుడు ఎస్.

 Puli Movie Fame Nikish Patel Re Entry News-TeluguStop.com

జె సూర్య కాంబినేషన్లో వచ్చిన “కొమరం పులి” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ “నిఖిషా పటేల్” కూడా ఈ కోవకే చెందుతుంది. ఈ అమ్మడు ఇతర దేశాలలో పుట్టి పెరిగినప్పటికీ భారతదేశంలో మోడలింగ్ రంగంలో పలు కోర్సులను చేసింది.

 ఈ క్రమంలో “పులి” చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకొని నటనా రంగం వైపు వచ్చింది.

 Puli Movie Fame Nikish Patel Re Entry News-ఈ పవన్ హీరోయిన్ మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుందా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ బాగానే రాణించింది.

కానీ కథల పట్ల పెద్దగా శ్రద్ధ వహించక పోవడంతో దాదాపుగా ఎక్కువ శాతం చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో చాలా కాలం పాటు ఈ అమ్మడు సినిమా అవకాశాలు లేక ఇంటి వద్దనే ఖాళీగా గడిపింది.

 దీంతోఆ మధ్య నటనలో మెలకువలను నేర్చుకునేందుకు కొంతకాలం పాటు సినిమాలకు గుడ్ బై చెప్పినట్లు కూడా అధికారికంగా ప్రకటించింది.

అయితే ఈ మధ్య కాలంలో నిఖిషా పటేల్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు అందమైన ఫోటోలు షేర్ చేస్తోంది.

 దీంతో ఈ అమ్మడు మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.అంతేగాక ఈసారి ఈ అమ్మడు బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ దర్శకుడి చిత్రం ద్వారా “రీ – ఎంట్రీ” ఇస్తున్నట్లు బాలీవుడ్ సినిమా వర్గాలు చర్చించుకుంటున్నాయి.

కానీ ఇప్పటి వరకు నిఖిషా పటేల్ మాత్రం తన రీ-ఎంట్రీ పై వినిపిస్తున్న వార్తల పై మాత్రం అసలు స్పందించలేదు.

ఈ విషయం ఇలా ఉండగా ఈ అమ్మడు తెలుగులో చివరగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఓం 3డి చిత్రంలో రెండో హీరోయిన్ గా,  అలాగే సాయి రామ్ శంకర్ హీరోగా నటించిన “అరకు రోడ్డులో” చిత్రాలలో నటించింది.

 కానీ ఈ చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి.అలాగే ఓ తమిళ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించినప్పటికీ పలు అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం ఇప్పటికీ విడుదల కాలేదు.

దీంతో ఈ అమ్మడు మూటా ముల్లె సర్దుకొని తన యునైటెడ్ కింగ్డమ్ కి చెక్కేసింది. 

#NikeshaPatel #PuliMovie #Nikesha Patel #NikeshaPatel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు