ప్రేమించడం టైమ్ వేస్ట్ అంటున్న పవన్ హీరోయిన్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కే సినిమాల్లో మెజారిటీ సినిమాలు ప్రేమ కథలే కావడం గమనార్హం.చాలామంది రీల్ సెలబ్రిటీలు కూడా షూటింగ్ సమయంలో ప్రేమించుకొని రీల్ కపుల్ కాస్తా రియల్ కపుల్ అయ్యారు.

 Puli Heroine Nikisha Patel Interesting Comments About Love, Nikisha Patel, Puli-TeluguStop.com

అయితే ఒక టాలీవుడ్ హీరోయిన్ మాత్రం లవ్ చేయడం టైమ్ వేస్ట్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్ జె సూర్య డైరెక్షన్ లో తెరకెక్కిన పులి సినిమా ద్వారా టాలీవుడ్ కు నిఖిషా పటేల్ పరిచయమయ్యారు.

అయితే పులి సినిమా డిజాస్టర్ కావడంతో ఆ తరువాత నిఖిషా పటేల్ కు అడపాదడపా అవకాశాలు వచ్చినా నిఖిషా ఆశించిన స్థాయిలో కెరీర్ లో సక్సెస్ కాలేకపోయారు.పులి సినిమా హిట్టై ఉంటే మాత్రం నిఖిషా కెరీర్ మరో విధంగా ఉండేదని చెప్పవచ్చు.

అందం, అభినయం పుష్కలంగా ఉన్నా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాని నిఖిషా లవ్ చేయడం, రిలేషన్ షిప్ లో ఉండటం టైమ్ వేస్ట్ వ్యవహారాలని పేర్కొన్నారు.

లవ్ అనేది తన దృష్టిలో నిలకడగా ఉండదని.

లవ్ పెద్ద బోరింగ్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.లవ్ గురించి మిగతా హీరోయిన్లకు భిన్నంగా నిఖిషా స్పందించడం గమనార్హం.

అయితే నిఖిషా ఇలా స్పందించడం కొందరు నెటిజన్లు నిఖిషా లవ్ లో ఫెయిల్ అయిందా.? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ గురించి నిఖిషా చేసిన కామంట్లు నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Telugu Komaram Puli, Love, Nikisha Patel, Pawan, Puli, Telugunikisha-Movie

తెలుగులో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాని నిఖిషా కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటించారు.తమిళంలో నిఖిషా నటించిన ఒక సినిమా విడుదల కావాల్సి ఉంది.సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందు నిఖిషా పటేల్ బీబీసీలో టీవీ షోలు కూడా చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube