'పులస' రేటు తెలిస్తే ఒళ్ళు పులిసిపోవాల్సిందే .!

నిజమే మరి.పులస రేటు వింటే సగటు మధ్య తరగతి వారికి ఒళ్ళు పులుసుపోవలసిందే మరి.ఈ నేపథ్యంలోనే ఓ నానుడి వుంది.“ఆస్తులు అమ్ముకొనైనా పులస పులుసు తినాల్సిందే.” మన జీవితంలో ఒక్కసారైనా పులస చేప కూర తినాల్సిందే అని అంటుంటారు ఆల్రెడీ దాన్ని రుచి చుసిన వారు.గోదావరి జిల్లాల ప్రజలు దాన్ని ఎంతో ప్రీతితో భుజిస్తారు.

 Pulasa Costly Godavari Districts Four Thousand-TeluguStop.com

అసలు ఈ పులస చేప ప్రత్యేకత ఏమిటి? దీనికి అక్కడ ఎందుకంత క్రేజ్? అసలు ఇది ఎక్కడ జీవిస్తుంది? ఇలాంటి ప్రశ్నలు మనలో చాలామంది మదిలో మెదులుతూ ఉంటాయి.

వీటి గురించి చెప్పాలంటే ఓ పాఠం రాయాలి.

 Pulasa Costly Godavari Districts Four Thousand-పులస’ రేటు తెలిస్తే ఒళ్ళు పులిసిపోవాల్సిందే .-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పేరాగ్రాఫ్ సరిపోదు.నిజమే.

ఈ పులసకూ, గోదావరి జిల్లాలకూ ఏదో విడదీయరాని బంధం ఉంటుంది.మామ్మూలుగా ఈ పులస చేపల్ని హిల్సా ఫిష్ అని కూడా అంటారు.

బేసిక్ గా ఇవి ఆస్ట్రేలియా సముద్ర జలాల్లో నివసిస్తూ ఉంటాయి.ఇక వర్షా కాలం రాగానే.

ఇవి ఇండియా వైపు పయనమౌతాయి.మన దగ్గర వానలు పడుతున్న సమయంలో, ఈ పులస చేపలు సముద్రం నుంచి నేరుగా గోదావరిలోకి ఎదురీత ఈదుతూ వచ్చి చేరుతాయి.

ఇక్కడకు రాగానే ఈ చేపల రంగు మారిపోతుంది.అలాగే గోదావరి జలాల వల్ల వీటి టేస్ట్ కూడా మారిపోతుంది.

ముఖ్యంగా ఇవి గోదావరి జలాల్లో పిల్లల్ని పెట్టడానికి వస్తాయి.ఆ సమయంలో వీటిని వలలు వేసి, వేటాడి పట్టుకుంటారు స్థానిక జాలరులు.ఇలా వచ్చిన పులస చేపల కోసం ప్రతి సంవత్సరం చాలామంది ఎదురుచూస్తుంటారు.ఎందుకంటే ఇవి ఏడాదిలో ఒక నెలలో మాత్రమే అందరికీ అందుబాటులో ఉంటాయి.

ఇకపోతే కరోనా వైరస్ కారణంగా ఈ సారి ఎక్కువగా ఈ చేపలు మార్కెట్‌లోకి రాలేదు.అందువలనే మునుపటికంటే వీటికి 4 రెట్లు డిమాండ్ అధికంగా పెరిగింది.నాలుగైదేళ్ల క్రితం కేజీ పులస రూ.1000 దాకా వుంటే, ఇపుడు అదే కేజీ చేప రూ.4500 ఉంటోంది.తాజాగా పి.గన్నవరంలోని చేపల మార్కెట్‌లో ఓ కేజీన్నర పులస రూ.7000 అమ్ముడైంది.

#PulasaFish #Fishes #Godavari #Fish Curry #Pulsa Fish

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు