బ్లాక్ హెడ్స్,మొటిమల మచ్చలను తొలగించటానికి పుదీనా పేస్ పాక్స్

పుదీనా వంటల్లోనే కాదు సౌందర్య పరిరక్షణలో కూడా బాగా సహాయపడుతుంది.పుదీనాను సౌందర్య పోషణలో మన పూర్వీకుల కాలం నుండి ఉపయోగిస్తున్నారు.

 Pudina Face Pack For Pimples And Blackheads-TeluguStop.com

పుదీనాలో అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబియాల్ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి.ఇవి బ్లాక్ హెడ్స్,మొటిమల మచ్చలు వంటి చర్మ సమస్యలను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

ఇప్పుడు పుదీనా పాక్స్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

 Pudina Face Pack For Pimples And Blackheads-బ్లాక్ హెడ్స్,మొటిమల మచ్చలను తొలగించటానికి పుదీనా పేస్ పాక్స్-Telugu Health-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి ఆకులను విడిగా పేస్ట్ గా తయారుచేసుకోవాలి.

ఈ పేస్ట్ లో పసుపు కలిపి ముఖానికి రాసి 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే బ్లాక్ హెడ్స్ తగ్గిపోతాయి.


కొన్ని పుదీనా ఆకులను పేస్ట్ గా తయారుచేసుకొని మొటిమలు ఉన్న ప్రాంతంలో రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగితే మొటిమలు మరియు మొటిమల కారణంగా వచ్చే మచ్చలను తొలగిస్తుంది.అంతేకాకుండా పుదీనాలో ఉన్న యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలకు కారణం అయినా కారకాలను తొలగించటంలో సహాయపడతాయి.

పుదీనా ఆకులను పేస్ట్ చేసి దానిలో పసుపు,రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖ ఛాయ మెరుగు అవుతుంది.

పుదీనాలో దురదను తగ్గించే లక్షణం ఉంటుంది.

చర్మం కాలిన గాయాలకు, ఎలర్జీలకు మంచి నివారణగా పనిచేస్తుంది.ఇవి ఎలర్జీ కలిగించే బాక్టీరియాను చంపుతాయి.

పుదీనా ఆకులను ముద్ద చేసి ప్రభావిత ప్రాంతంలో రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే దురద సమస్యలు దూరం అవుతాయి.

#Pimples #Face Pack #Black Heads #Mint Leaves #Home Remedies

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు