బాబుకు మరీ ఎక్కువ ఇంపార్టెన్స్‌.. ఆయన నెత్తికి ఎక్కుతున్నాడు

బిగ్‌బాస్‌ హౌస్‌లో బాబు గోగినేని ఎంట్రీ ఇచ్చినప్పుడు అంతా కూడా కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.టీవీ చర్చ కార్యక్రమంలో ఎక్కువ పాల్గొని మూడ నమ్మకాలను తొలగించేలా ప్రయత్నాలు చేసే బాగు గోగినేని ఈ షోకు ఆకర్షణగా నిలుస్తాడని అంతా భావించారు.

 Public Shocking Comments About Babu Gogineni Role-TeluguStop.com

అందరు అనుకున్నట్లుగానే బాబు గోగినేని ఇంటికి ప్రత్యేక ఆర్షణగా నిలవడంతో పాటు బిగ్‌బాస్‌ ఇంట్లో బిగ్గర్‌బాస్‌ అయ్యాడు.బిగ్గర్‌ బాస్‌ అంటూ ఇంట్లో సభ్యులు అంతా కూడా ఆయన్ను చాలా గౌరవించడం మొదలు పెట్టాడు.

బిగ్‌బాస్‌ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని చేయాలి.కెప్టెన్‌ ఇచ్చిన పనిని బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులు అంతా కూడా చేయాలి.

కాని బాబు గోగినేని మాత్రం ఎక్కువ పనులు చేయకుండా తప్పించుకుంటూ ఉన్నారు.

ఇక ఇంటి సభ్యులు ఏ సమస్య వచ్చినా కూడా బిగ్గర్‌ బాస్‌ అంటూ బాబు గోగినేనిని ఆశ్రయించడం, ఏ ఒక్కరు మనసు బాగాలేక పోయినా కూడా బాబు గోగినేని వద్దకు వెళ్లడం చాలా సహజంగా కనిపిస్తూ వస్తుంది.

ఇక తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి సాంత్వన కలిగేలా అవతలి వారిని విమర్శిస్తూ బాబు గోగినేని మాట్లాడటం జరుగుతుంది.దాంతో ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా బాబు గోగినేని పెద్ద దిక్కు అన్నట్లుగా మారిపోయాడు.

బాబు గోగినేని తాజాగా ఎలిమినేషన్‌కు నామినేషన్‌ అవ్వడంతో తనలోని అసంతృప్తిని బయటకు తీసుకు వచ్చాడు.

ఒక ఇంట్లో అంతా తెలుగు మాట్లాడుతూ, కలిసి ఉన్నంత మాత్రాన అంతా సమానం కాదని, తాను ఇంటర్నేషనల్‌ ఫిగర్‌ అంటూ చెప్పుకొచ్చాడు.తన స్థాయికి బిగ్‌బాస్‌ అనేది తక్కువ అని, అందరికి తాను సమానం ఎప్పటికి కాను అంటూ మాట్లాడటం ఆయనలోని అహంభావంను చూపిస్తుంది.మనుషులు అంతా కూడా ఒక్కటే అంటూ చెప్పే హేతువాది అయిన బాబు గోగినేని తానో ఇంటర్నేషనల్‌ ఫిగర్‌ను, తనను ఎవరు ఇంట్లో ఆర్డర్‌ వేయడం కాని, శాషించడం కాని చేయవద్దు అంటూ చెప్పడం కొందరు జీర్ణించుకోలేక పోతున్నారు.

ఇంటి సభ్యులు ఆయనకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం వల్లే ఆయన ఆ రేంజ్‌లో రెచ్చి పోతున్నాడు, అంతా కూడా ఆయన్ను గౌరవిస్తున్న కారణంగా ఇంట్లో ఉన్న వారందరి కంటే తనకే ఎక్కువ తెలివి ఉంది, తానే పెద్ద సెలబ్రెటీ, తనను మించిన వారు ఇంట్లో మరెవ్వరు లేరు అంటూ భావిస్తున్నట్లుగా అనిపిస్తుంది.అందుకే ఇకపై అయినా ఇంటి సభ్యులు బాబు గోగినేనితో జాగ్రత్తగా ఉంటే మంచిది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

మరో వైపు రాజమౌళిపై ఈయన చేసిన విమర్శల ప్రభావం కూడా ఆయన ఎలిమినేషన్‌ నామినేషన్స్‌లో ఉంటే ఆయనపై పడే అవకాశం ఉందనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube