'అరవింద సమేత' చూసి త్రివిక్రమ్ కి ఒకరు రాసిన బహిరంగ లేఖ ఇది.! ఒకసారి రాయలసీమ గురించి తెలుసుకొని...!     2018-10-13   13:37:15  IST  Sai Mallula

త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి నా బహిరంగ లేఖ…..

నా పేరు అనిల్ నేను రాయలసీమ వాసిని అనంతపురం జిల్లాలో ఓ ఊరు మాది..

నిన్ననే మీ సినిమా అరవిందా సమేత చూసాను మా సీమ గురుంచి సినిమా తీసినందుకు ఓ నాలుగు మాటలు రాయాలి అనిపించి ఈ లేఖ రాస్తున్నా…. 2000 ,2001 ఆ టైమ్ లో మీరు అంటే గౌరవం వుండేది అప్పుడు మీ కలం లో ఇంకు తో పాటు మెదడు కూడా బాగా పనిచేసేవి అప్పుడు మీకు డబ్బు సెలబ్రిటీ హోదా లేవు….ఒకప్పుడు మీ కథలు హీరో స్థానంలో ఉండేవి కానీ ఇప్పుడు మీరు హీరోని బట్టి కథ రాసుకుంటున్నారు…ఎప్పుడైతే మీ లాంటి దర్శకులు హీరో నీ దృష్టిలో పెట్టుకొని కథలు రాయడం మొదలు పెట్టారో ఆ దర్శకుడు ఒక్కో మెట్టు క్రిందకు డిగిజారినట్టే లెక్క…

Public Letter From A Fan Of Trivikram To Trivikram-

Public Letter From A Fan Of Trivikram To Trivikram

అరవింద సమేత కథకు వస్తే మా సీమ ప్రాంతం కథ ఎన్నుకున్నారు బూజు పట్టిన పాత ఫ్యాక్షన్ మూట తగాదాలు కథగా ఎంచుకోవడం మీ మూర్కాపు ఆలోచనలు కు నిదర్శనం….B. గోపాల్ ,vv. వినాయక్ , బోయపాటి శ్రీను లాంటి వారు మా ప్రాంతాన్ని మాత్రమే ఎంచుకున్నారు మీరు ఒక అడుగు ముందుకు వేసి మా యాసను భాషను సాంస్కృతినీ కూడా ఎంచుకొని బ్రష్టు పట్టించారు…డబ్బు కోసం ఇంత దిగజారడం మంచిది కాదు మా సీమ భావితరాల ప్రజలకు మీరు చెప్పేది ఇలాంటి కథలా సిగ్గు వేయటం లేదా మీకు….5రూపాయల ఫ్యాక్షన్ కథ అని ఇలా మొదలుపెడతారా మనిషి అనే వాడు మీరు చదివిన డిగ్రీలు మీరు నేర్చుకున్నా సంస్కారం ఇదేనా…

కోపాలు, ఆవేశాలు ,మూర్కాపు ఆలోచనలు ప్రతి ప్రాంతాల్లో ఉంటాయి ప్రత్యేకంగా రాయలసీమ లో ఏమి ఉండవు అన్ని చోట్లో ఒకేలా ఉంటాయి బావద్వేగలు కానీ మీరు మీ సినిమా వాళ్ళు భూతద్దం పెట్టుకొని మా సీమా అని ఒక ట్యాగ్ తగిలించి ఇలా చూపెట్టడం సంస్కారం కాదు…మీరు నివసించే చోట మీ చుట్టూ పక్కల ప్రాంతాల్లో హత్యలు జరగడం లేదా మొన్న హైదరాబాద్ లో నడి రోడ్డు మీద హత్యలు జరగలేద వాటి మీద కనీస మాట రూపంలో కూడా స్పందించలేదు….అసలు ఫ్యాక్షన్ అంటే ఏమిటి అని కొంచమైన తెలుసా తెల్ల బట్టలు వేసుకుని ఒక కత్తి సుమో పట్టించి ఫ్యాక్షన్ రౌడీలు వీరే అని ముద్ర వేస్తున్నారా…..

ఇక్కడ ఫ్యాక్షన్ ఎలా పుట్టిందో ఎందుకు పుట్టిందో ఎవరు పుట్టించారో దాని వల్ల ఎవరు లాభ పడ్డారు ఎవరు నష్టపోయినారో ముందు తెలుసుకోండి….ఇక్కడ మా సీమా లో ఉన్నా ఖనిజ సంపద మరెక్కడా లేవు అందుకే ఇక్కడ రాజకీయ నాయకులు డేగ కన్ను మా సీమా మీదే 1983 అప్పటి పార్టీలు నుండి ఇప్పటి పార్టీల వరకు అందరు దోచుకొని వెళ్లిన దొంగలే….ఎదురు తిరిగినా వాళ్ళని అనగదొక్కడానికి చంపడానికి ఏర్పాటు చేసిందే రాజకీయ నాయకులు కిరాయి ముఠాలు అవే ఫ్యాక్షన్ ముఠాలు గా చెలామణి అవుతున్నాయి……ఇవి కేవలం రాజకీయ నాయకులు లబ్ది కోసం సృష్టించిన కిరాయి ముఠాలు అవే ఫ్యాక్షన్ ముఠాలు అవేమి ప్రజలు సృష్టించలేదు…

Public Letter From A Fan Of Trivikram To Trivikram-

ఏ సినిమా తీసిన సీమా లో రెండు ఊర్లు తగాదాలు చూపిస్తారు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది అలా చూడటం ఇవన్నీ తెలియకుండా మీరు మా ప్రాంతం మీద మా సంస్కృతి మీద మా యాస మీద సినిమాలు తీస్తారు….ముందు మా ప్రాంతం మా ప్రజలు గురించి తెలుసుకొని కథలు రాయండి మేమూ కారాలు ఎక్కువగా తింటాం అందుకే మాకు మమకారాలు ప్రేమలు అన్ని ఎక్కువే…ఇప్పుడు మీరు అనుకున్నట్లుగా ఇక్కడ ఫ్యాక్షన్ లేదు ఎవడు రెడ్డి మోచేతి నీళ్లు తాగడం లేదు వాళ్ళు చదువుకోక లేక పోయినా వాళ్ళ పిల్లలు ను చదివించారు ప్రయోజకులను చేశారు…..
. . గత 20సవంత్సరాలు గా మాకు ఎండుపొలం పంటలు పండడం లేదు కరువు తో విలవిల లాడుతున్నాం కనీసం మంచి నీరు కూడా లేదు కనీస సౌకర్యాలు కూడా లేవు…..4జిల్లాలకు ఒకటే పెద్ద ఆసుపత్రి అదే కర్నూలు ధర్మసూపత్రి పల్లెలు నుండి రోగులను ఆస్పత్రికి తరలించలోపే మార్గ మధ్య లొనే చనిపోతున్నారు ఇక్కడ కనీస రోడ్డు మార్గాలు లేని పల్లె ప్రాంతాలు ఎన్నో ఇవన్నీ మీకు కనపడవా???….
.

త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒక్కసారి వచ్చి మా ప్రాంతపు వలసలు చూడండి మీకు తెలుస్తుంది కర్నూలు జిల్లా వలసలు గుంటూరు మిర్చియార్డు లో చూడండి అనంతపురం జిల్లా వలసలు బెంగళూర్ కేరళ ఫూట్ పాత్ లలో చూడండి తెలుస్తుంది…..
రాళ్లనే పిండి చేసే సత్త ఉన్నా వాళ్ళు కష్టపడి బ్రతకడం మా డిఎన్ఏ లోనే ఉంది….
.ఎందరో మహానుభావులు పుట్టిన గడ్డ ఇది దయచేసి మా ప్రాంతం జోలికి రాకండి……
. .నా రాయలసీమ – రతనాలసీమ
*****************************

🔹 *మాడుగుల నాగఫణి శర్మ* (జననం 1959 తాడిపత్రి, అనంతపురం)

🔹 *లక్కోజు సంజీవరాయ శర్మ* (1907-1997 ప్రొద్దుటూరు, కడప) గణిత బ్రహ్మగా పేరొందిన వీరు ప్రపంచంలో ఆరు వేల గణితా వధానాలు చేసిన ఏకైక వ్యక్తి

🔹 *అన్నమయ్య* (1408-1503 రాజంపేట కడప) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయ కారుడు..!!

🔹 *కుందకుందాచార్యుడు* (కొనకొండ్ల – గుంతకల్లు -అనంత పురం
🔹 *తరిగొండ వెంగమాంబ* (1730 -1817 తరిగొండలో చిత్తూరు జిల్లా) 19వ శతాబ్దపు తెలుగు కవయిత్రి.

🔹 *పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి,* కంది మల్లయ పల్లి, కడప.!! 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త వేమన (సుమారు 1652-1730 మధ్యకాలం, కడప జిల్లా

🔹 *మొల్ల* (1440 -1530 –గోపవరం-కడప) 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి.

🔹 *గజ్జెల మల్లారెడ్డి* (1925 ఆంకా ళమ్మ గూడూరు కడప) ఈయన ఒక అభ్యుదయ, వ్యంగ్య కవి

🔹 *గువ్వల చెన్నడు* (17-18 శతా బ్దాల శతక కవి) కడప జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన గువ్వల చెన్నడు “గువ్వల చెన్నా” అనే మకుటంతో శతకాన్ని రచించాడు..!!

🔹 *పుట్టపర్తి నారాయణా చార్యులు* (1914-1990 చియ్యేడు-అనంత పురం) తెలుగు పదాల తో ‘‘శివ తాండవం’’ ఆడించిన కవి.

🔹 *తరిమెల నాగిరెడ్డి* (1917-1976 తరిమెల గ్రామం-అనంతపురం)

🔹 *B.N రెడ్డి* (బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి 1908-1977) జన్మస్థలం కొత్తపల్లి, పులి వెందుల, కడప జిల్లా..!! బి.ఎన్.రెడ్డి తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు, పద్మ భూషణ్ పురస్కార గ్రహీత.

🔹 *బి.నాగిరెడ్డి* (బొమ్మిరెడ్డి నాగిరెడ్డి 1912-2004 విజయ ప్రొడక్షన్స్ ) దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన వ్యక్తి..

🔹 *కె.వి.రెడ్డి* (జూలై 1, 1912 – 1972 అనంతపురం జిల్లా తాడిపత్రి) కదిరి వెంకటరెడ్డి తెలుగు సినిమాల కు స్వర్ణ యుగమైన, 1940-1970 మధ్య కాలంలో ఎన్నో ఉత్తమ చిత్రాల ను తెలుగు తెరకు అందించిన ప్రతిభా వంతుడైన దర్శకుడు, నిర్మాత మరియు రచయిత..!!

🔹 *టీ.జి. కమలాదేవి* (1930 – 2012 కార్వేటి నగరం చిత్తూరు) ఈమె తెలుగు సినిమా నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి

🔹 *జిక్కి* (1938-2004 చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో జననం)

🔹 *నీలం సంజీవరెడ్డి* (1913-1996, ఇల్లూరు గ్రామం అనంతపురం) భారత రాష్ట్రపతి

🔹 *దామోదరం సంజీవయ్య* (1921–1972 కల్లూరు కర్నూలు) మొదటి దళిత ముఖ్యమంత్రి

🔹 *మునెయ్య* (కడప జిల్లా, దొమ్మర నంద్యాల గ్రామం) ఈయన ప్రముఖ జానపద గాయకుడు.

🔹 *జిడ్డు కృష్ణమూర్తి* (1895-1986 మదనపల్లె చిత్తూరు జిల్లా)

🔹 *బళ్ళారి రాఘవ* (1880-1946 తాడిపత్రి అనంతపురం జిల్లా)

🔹 *సుందరంబాడి శంకరాచారి* (1914-1977 తిరుపతి చిత్తూరు జిల్లా)

🔹 *C.R Reddy* (1880-1951 కట్టమంచి చిత్తూరు) కట్టమంచి రామలింగారెడ్డి ప్రతిభా వంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది. ఆదర్శ వాది, రాజ నీతిజ్ఞుడు. ఇంతటి ప్రతిభా పాటవాలు ఒక వ్యక్తిలో కానరావడం అరుదు..!!

🔹 *గడియారం వేంకట శేషశాస్త్రి* (1894 పెదముడియం కడప) పరాయి పాలనను నిరసించి స్వాతంత్రకాంక్షను అణు వణువు నా రగుల్చుతూ రచించిన మహా కావ్యమే ‘శ్రీశివభారతం’.

🔹 *జానమద్ది హనుమ చ్ఛాస్త్రి* (1926-2014 రాయదుర్గం అనంతపురం) తెలుగులో ఒక విశిష్టమైన బహు గ్రంథ రచయిత..!!

🔹 *మధురాంతకం రాజారాం* (1930-1999 మొగరాల గ్రామం చిత్తూరు జిల్లా)

🔹 *విప్లవ సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి* (జననం 18 శతాబ్దం తొలినాళ్ళ లో-మరణం-1847 జన్మస్థానం రూపనగుడి కర్నూలు జిల్లా)

*రాయలసీమ అంటే ఇది..!! ఇలా ఎందఱో మహాను భావులు మరెందరో చరిత్రలో నిలచిన వారు. ఇక్కడ ఆప్యాయతకి అద్భుతమైన ఆతిధ్యానికి మారుపేరు. ఇప్పుడు చెప్పండి రాయల సీమ అంటే ఏంటో ఇప్పుడు చెప్పండి సీమ వైభోగం ఏంటో ఎలా ఉండేదో. తలెత్తి సగర్వంగా చాటి చెప్పండి…..