సర్వే : థియేటర్ల ఓపెన్‌పై జనాల మాట

కరోనా కారణంగా దాదాపు అయిదు నెలలుగా థియేటర్లు మూతబడి ఉన్నాయి.లాక్‌ డౌన్‌ ప్రారంభంకు ముందు నుండే కరోనా భయంతో థియేటర్లను మూసేశారు.

 Public About Movie Theaters Open, Public, Movie Theaters , Lock Down, Corona Eff-TeluguStop.com

లాక్‌ డౌన్‌ మెల్ల మెల్లగా ఎత్తివేస్తున్నారు.అయితే థియేటర్లకు ఉన్న లాక్‌డౌన్‌ను మాత్రం కేంద్ర ప్రభుత్వం తొలగించడం లేదు.

ఆగస్టులో థియేటర్లు ఓపెన్‌ అవుతాయని అంతా అనుకున్నారు.కాని ఇంకా కూడా థియేటర్లకు వేసిన తాళంను కేంద్రం ఓపెన్‌ చేయలేదు.

ఇలాంటి సమయంలో సెప్టెంబర్‌లో ఖచ్చితంగా ఓపెన్‌ అయ్యే అవకాశం ఉందంటూ కేంద్ర వర్గాల నుండి లీక్‌ అందుతుంది.

మరో వైపు కేంద్రం మరియు ఇతర వర్గాల వారు థియేటర్లు ఓపెన్‌ విషయమై జనాల అభిప్రాయాలను సేకరించే పనిలో ఉన్నారట.

మెట్రో నగరాలు మరియు చిన్న పట్టణాలు ఇలా అన్ని చోట్ల సర్వేలు నిర్వహించగా ప్రతి చోట కూడా ఇప్పట్లో థియేటర్లు ఓపెన్‌ చేయకపోవడమే మంచిది అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారట.ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించాలి.

ఇలాంటి సమయంలో కోరి ప్రమాదంను కొని తెచ్చుకోవడం అంటే అది ఖచ్చితంగా పిచ్చి తనం అవుతుంది.అందుకే మేము థియేటర్ల ఓపెన్‌కు వ్యతిరేకం అంటున్నారు.

కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చే వరకు థియేటర్లు ఓపెన్‌ చేయవద్దని కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం రెండు మూడు నెలలు వెయిట్‌ చేస్తే బాగుంటుందని అంటున్నారు.అతి తక్కువ మంది మాత్రం వెంటనే థియేటర్లు ఓపెన్‌ చేయాలని చెబుతున్నారు.

సగానికి పైగా జనాలు మాత్రం కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత బొమ్మ వేస్తే బాగుంటుందని అంటున్నారు.కనుక వారు థియేటర్లు సెప్టెంబర్‌లో ఓపెన్‌ అయినా సినిమాలకు వచ్చే పరిస్థితి లేదంటున్నారు.

మరి కేంద్రం నిర్ణయం ఏంటీ, థియేటర్ల యాజమాన్యాలు ఏం ఆలోచిస్తున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube