పబ్జీ అభిమానులకు చేదు వార్త... అదేంటంటే?

భారత ప్రభుత్వం ఎన్నో రకరకాల నిర్ణయాలు తీసుకుంటుంది.కాని యూత్ ను ఎక్కువగా బాధపెట్టిన నిర్ణయం పబ్ జీ బ్యాన్ నిర్ణయం.

 Bad News For Pubg Lovers, Pubg, Pubg Ban, Pubg Lite Banned, China, Indian Govt,-TeluguStop.com

దేశ యువత పబ్ జీ గేమ్ కి అడిక్ట్ గా మారి ఇక 24 గంటలు అందులోనే మునిగిపోయి ఉంటూ, కొంత మంది తమ ప్రాణాలను సైతం కోల్పోయిన సందర్భంలో అప్పట్లోనే పబ్ జీ ని నిషేధించాలని సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేసాయి.అయితే అప్పట్లో ఎటువంటి నిర్ణయం తీసుకోని కేంద్ర ప్రభుత్వం చైనా- భారత్ సరిహద్దు వివాదం విషయంలో చైనా కంపెనీలు భారతీయుల డేటాను చోరీ చేస్తున్నాయని, భారతీయుల డేటా పట్ల భద్రత లేదని ఇంటిలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి తెలిపాయి.

అందుకే చైనా కేంద్రంగా పనిచేస్తున్న ప్రతి యాప్ ను భారతప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే.అయితే అందులో ముఖ్యమైన యాప్స్ పబ్ జీ, టిక్ టాక్.

ఇక పబ్ జీ విషయంలోకి వస్తే త్వరలో పబ్ జీ మరల భారత్ లో తమ కార్యకలాపాలను ప్రారంభించనుందనే లీకులు వచ్చాయి.అయితే అయితే పబ్జీ మొబైల్ తో పాటుగా పబ్జీ లైట్ పై కూడా నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ పబ్ జీ యాజమాన్యం భారత్ లో పబ్ జీ కొనసాగింపుపై ఓ ప్రకటన చేసింది.ఇక భారత్ లో మా ప్రయాణం ముగింపుకు సమయం ఆసన్నమైందని సుదీర్ఘ చర్చల అనంతరం ఇక పబ్ జీ కొనసాగే ఛాన్స్ లేదని పబ్ జీ యాజమాన్యం తెలిపింది.

ఏది ఏమైనా మరల పబ్ జీ భారత్ లో అడుగు పెడుతుందని వేచి చూస్తున్న వారికి ఇది చేదు వార్త అని చెప్పవచ్చు.పబ్ జీ అనేది అతి తొందర కాలంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన గేమ్ లలో ఒకటిగా నిలిచిందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube