రిలయన్స్ జియోతో పబ్‌జి కార్ప్ కలవనుందా...? పబ్‌జి గేమ్ భారత్ ‌లో రీఎంట్రీ కానుందా..?

సెప్టెంబర్ రెండో తారీఖున భారతదేశ ప్రభుత్వం దేశ ప్రజల పర్సనల్ విషయాల భద్రతకు సంబంధించి చైనా దేశానికి సంబంధించిన 118 మొబైల్ యాప్స్ ను నిషేధించిన సంగతి అందరికీ తెలిసిందే.ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన గేమ్ పబ్ జి కూడా ఉంది.

 Reliance Jio Good News For Pubg Players, Pubg Lite, Reliance Jio, India, China A-TeluguStop.com

మాతృ సంస్థ పబ్ జి కార్ప్ చైనా దేశానికి చెందిన టెన్ సెంట్ గేమ్స్ తో ఉన్న సంబంధాన్ని పూర్తిగా తెంచుకున్న సంగతి కూడా విదితమే.నిజానికి భారతదేశంలో పబ్ జి ఆట రావడానికి చైనా దేశం సంబంధించిన టెన్ సెంట్ గేమ్స్ సంస్థనే.

ఇకపోతే తాజాగా భారతదేశంలో పబ్ జి కార్ప్ ఆటను తిరిగి దేశంలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.అయితే ఇందుకోసం సదరు సంస్థ భారత్ లో కొత్త పార్ట్నర్ కొరకు వెతుకులాట మొదలు పెట్టింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా రిలయన్స్ జియో తో కలిసి పబ్ జి కార్ప్ భారతదేశంలో గేమ్ ను వారి యూజర్లకు అందించబోతున్నట్లు సమాచారం.ఈ విషయంపై జియో సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు బిజినెస్ వర్గాల నుంచి సమాచారం.

ఇలా జియో సంస్థతో జత కట్టడం ద్వారా వారి గేమ్ తిరిగి భారతదేశంలో అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది పబ్ జి కార్ప్.అయితే ఇంతవరకు బాగున్న ఆటలో వారి యూజర్స్ క్రీడకు సంబంధించి పబ్ జి కార్ప్ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే.

దీనికి గల కారణం ఆటపై ఉన్న నిషేధాన్ని తొలగించాలంటే ఈ ముఖ్యమైన విషయం చాలా అవసరం.యువతకు సంబంధించిన డేటాను భారతదేశంలో స్టోర్ చేసినట్లయితే ఆ ఆటపై ఉన్న నిషేధాన్ని భారతదేశ ప్రభుత్వం తొలగించేందుకు పూర్తి అవకాశాలు లేకపోలేదు.

అయితే ఇందుకు సంబంధించి ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు.కాబట్టి రిలయన్స్ జియో తో కూడా పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసుకున్న ఒకవేళ భారతదేశంలో పబ్ జి మొబైల్ వర్షన్ తిరిగి మళ్ళీ భారత్ లో వస్తుందన్న గ్యారెంటీ లేదు.

మరి ఇలాంటి విషయం ఉన్నప్పుడు ఇరు సంస్థలు ఎలా వ్యవహరిస్తాయో వేచి చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube