బ్యాన్ చేసినా పబ్జీని భారత్ లో ఆడొచ్చు... ఎలా అంటే?

నిన్న సాయంత్రం కేంద్ర ప్రభుత్వం పబ్జీపై బ్యాన్ విధించడంతో నిన్నటి నుంచి పబ్జీ గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.పబ్జీ లవర్స్ యాప్ పై కేంద్రం బ్యాన్ విధించడంతో పడుతున్న బాధ వర్ణనాతీతం.

 Pubg Banned In India But We Can Play In Desktop Version, Pubg, Banned, India, Ch-TeluguStop.com

గత కొన్ని నెలల నుంచి చైనా, భారత్ దేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బ తినడంతో కేంద్రం పబ్జీపై బ్యాన్ ను విధించింది.కేంద్రం నిషేధించిన యాప్స్ లో పబ్జీతో పాటు మరో 118 యాప్స్ ఉన్నాయి.

భారత్ లో 50 మిలియన్ల మంది పబ్జీని డౌన్ లోడ్ చేసుకోగా 35 మిలియన్ల మంది పబ్జీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు.అయితే పబ్జీ లవర్స్ ఈ గేమ్ ను డెస్క్ టాప్ వెర్షన్ లొ ఆడవచ్చు.

దక్షిణ కొరియా కంపెనీ పబ్జీ డెస్క్ టాప్ వెర్షన్ ను రూపొందించడం వల్ల డెస్క్ టాప్ వెర్షన్ పై నిషేధం అమలులో లేదు.పబ్జీ మొబైల్‌, పబ్జీ మొబైల్‌ లైట్‌ యాప్‌ను దక్షిణ కొరియా కంపెనీ లైసెన్స్ తో టెన్‌సెన్ట్ కంపెనీ తయారు చేయడంతో వీటిపై మాత్రం నిషేధం కొనసాగుతోంది.

అయితే యాప్ లో మాత్రం పబ్జీని ఆడే వీలు ఉండదు.గతంలో టిక్ టాక్ పై బ్యాన్ ఏ విధంగా అమలైందో పబ్జీ యాప్ పై కూడా బ్యాన్ అదే విధంగా కొనసాగుతుంది.

గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే వీలు ఉండదు.మన దేశంలో నెట్వర్క్ ల నుంచి కూడా యాప్ ల ఐపీ అడ్రస్ లను తొలగిస్తారు కాబట్టి పబ్జీని డౌన్ లోడ్ చేసుకోవడం, ఆడటం సాధ్యపడదు.

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తొలగితే మాత్రమే పబ్జీ, టిక్ టాక్, ఇతర యాప్స్ పై నిషేధం తొలగించే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube