PSPK28 : ఈసారి ఎంటర్‌టైన్మెంట్‌ మాత్రమే కాదు

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు సందర్బం నేడు ఆయన నటిస్తున్న నాలుగు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్‌ వచ్చాయి.వకీల్‌ సాబ్‌ సినిమా స్టిల్‌ విడుదల అవ్వగా పవన్‌ 27వ సినిమాకు సంబంధించి క్రిష్‌ ఒక ప్రీలుక్‌ పోస్టర్‌ ను విడుదల చేశాడు.

 Pspk28 : ఈసారి ఎంటర్‌టైన్మెంట్‌ మా-TeluguStop.com

ఇక 29వ సినిమా కు సంబంధించి సురేందర్‌ రెడ్డి అప్‌ డేట్‌ ఇచ్చాడు.అయితే 28వ సినిమాకు సంబంధించి హరీష్‌ శంకర్‌ ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వబోతున్నాడు అంటూ ఎదురు చూసిన ప్రేక్షకులు అనుకున్నట్లుగానే సర్‌ ప్రైజ్‌ ఇచ్చాడు.

ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌ తో గబ్బర్‌ సింగ్‌ వంటి మాస్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమాను చేసిన హరీష్‌ శంకర్‌ ఈసారి అంతకు మించి అన్నట్లగా చేయబోతున్నాడట.గబ్బర్‌ సింగ్‌ సినిమాలో కేవలం ఎంటర్‌ టైన్‌మెంట్‌ మాత్రమే ఉంది.

ఈసారి తాను పవన్‌ తో తీయబోతున్న సినిమా ప్రత్యేకం అన్నట్లుగా ప్రీ లుక్‌ పోస్టర్‌ లో హరీష్‌ శంకర్‌ చెప్పాడు.ఈసారి కేవలం ఎంటర్‌ టైన్‌మెంట్‌ మాత్రమే కాదు అంటూ హింట్‌ ఇచ్చాడు.

దేశ భక్తితో పాటు పొలిటికల్‌ విషయాలను కూడా చూపించేలా ఉన్నాడు.

ఇండియా గేట్‌ తో పాటు సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మరియు సుభాష్‌ చంద్రబోష్‌ ల ఫొటోలను ఈ పోస్టర్‌ లో పెట్టడంతో సినిమాపై అంచనాలు భారీగా వస్తున్నాయి.

మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ లో రూపొందబోతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించబోతున్నట్లుగా గతంలోనే ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.వచ్చే ఏడాదిలో ఈ సినిమా పట్టాలెక్కనుంది.

ఇక విడుదల ఎప్పుడు అనేది షూటింగ్‌ ప్రారంభం అయిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube