ఫస్ట్‌లుక్ టాక్: తీరిగ్గా పుస్తకం చదువుతున్న వకీల్ సాబ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.అలాంటిది దాదాపు రెండేళ్ల తరువాత పవన్ చిత్రం వస్తుండటంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

 Pspk26 Titled Vakeel Saab First Look Poster Released-TeluguStop.com

కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు సంబంధించి గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి.అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను కొద్ది నిమిషాల క్రితం చిత్ర యూనిట్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు.

ఈ సినిమాకు ప్రాచుర్యంలో ఉన్న ‘వకీల్ సాబ్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేశారు.ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ తీరిగ్గా కాళ్లు చాపుకుని కుర్చున్నాడు.

కళ్లకు నల్లటి అద్దాలు పెట్టుకుని చేతిలో పుస్తకం పట్టుకుని చదువుతున్నాడు.లాయర్‌గా కనిపించే పవన్ ఏదో సీరియస్‌గా చదువుతుండటంతో ఈ సినిమాలో పవన్ పాత్రపై అప్పుడే అంచనాలు పెరిగాయి.

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ ఇది రీమేక్‌గా వస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.

నివేదా థామస్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube