వకీల్ సాబ్ మేనియాలో కొట్టుకుపోయిన బాలీవుడ్ స్టార్ హీరో  

Pspk26 First Look Dominates Sooryamshi Trailer - Telugu Akshay Kumar, Pawan Kalyan, Pspk26, Sooryamshi Trailer, Vakeel Saab

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల తరువాత సినిమా చేస్తుండటంతో ఆ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎలాంటి రచ్చ సాగుతుందో అందరికీ తెలిసిందే.

Pspk26 First Look Dominates Sooryamshi Trailer

కాగా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఇచ్చిన తరువాత ఆ రచ్చ రెట్టింపు అయ్యింది.

ఇక మార్చి 2న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కావడంతో పవన్ ఫ్యాన్స్ వకీల్ సాబ్ పోస్టర్‌ను ఎలా ట్రెండింగ్‌ చేశారో మనం చూశాం.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో వారు ఎంత వైరల్ చేశారంటే, బాలీవుడ్‌లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ చిత్ర ట్రైలర్‌ను పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ డామినేట్ చేసింది.పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.

అటు బాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్న సూర్యవంశీ ట్రైలర్ బాగున్నా, పవన్ మేనియాలో అది కనబడకుండా పోయింది.వకీల్ సాబ్‌గా కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఇంత ప్రభంజనం సృష్టించిన పవన్ కళ్యాణ్, ఇక సినిమా రిలీజ్‌తో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడా అని అందరు అనుకుంటున్నారు.

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్‌కు ఈ సినిమా రీమేక్‌గా వస్తున్న సంగతి తెలిసిందే.దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తు్న్న ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా నివేదా థామస్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pspk26 First Look Dominates Sooryamshi Trailer Related Telugu News,Photos/Pics,Images..

footer-test