పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘అయ్యప్పనుమ్ కోషియం‘ అనే మలయాళ రీమేక్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేసారు.
ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాను #PSPKRana అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు చివరి దశకు చేరుకున్నా ఇంకా టైటిల్ ప్రకటించక పోవడంతో అభిమానులు ఈ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.
పవన్ సినిమాల్లో షూటింగ్ చివరి దశకు చేరుకున్నాక టైటిల్ పెట్టడం ఇదే మొదటిసారి.అందుకే ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే పోస్టర్స్ విడుదల చేసి ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగేలా చేయడంతో మేకర్స్ సక్సెస్ అయినట్టే చెప్పాలి.అయితే ఈ రోజు ఒక అప్డేట్ తో మేకర్స్ మన ముందుకు వచ్చారు.
ఈ సినిమా టైటిల్, ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నట్టు అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.
ఆగస్టు 15 న స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఉదయం 9 గంటల 45 నిముషాలకు ఈ సినిమాకు సంబంధించి పవర్ స్ట్రామ్ రాబోతున్నట్టు తెలిపారు.
అంతేకాదు ఒక పోస్టర్ విడుదల చేసి ఈసారి మాములుగా ఉండదు.పూనకాలే అంటూ పవన్ లుంగీ తో ఉన్న ఫోటోను షేర్ చేసారు.
పవన్ లుక్ చూసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అటు తిరిగి నిలుచున్న కూడా పవర్ స్టార్ లుక్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసాడు.
మరి ఎలాంటి టైటిల్ పెట్టారో ఫస్ట్ సింగిల్ ఎలా ఉండబోతుందో అని ఇప్పటి నుండో అభిమానులు ఆలోచిస్తున్నారు.మరొక రోజు ఆగితే కానీ ఆ అప్డేట్ గురించి పూర్తిగా తెలియదు.ఇది ఇలా ఉంటే.ఈ సినిమాలో పవన్ తో పాటు దగ్గుబాటి రానా కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమా యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నాడు.థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్ మెంట్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక ఇందులో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తుంటే.రానా సరసరా ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది.