ఆ సమయంలో చావును దగ్గరినుంచి చూశా.. పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ టాలీవుడ్ నటుడు బబ్లూ పృథ్వీరాజ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.సినిమాలలో నటించినా, సీరియళ్లలో నటించినా పృథ్వీరాజ్ తనదైన శైలి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

 Pruthwiraj Shocking Comments Goes Viral In Social Media Details Here  , Pruthwir-TeluguStop.com

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ నాజరు నాకు గురువు అని మెథడ్ యాక్టింగ్ ను నేను ఆయన నుంచి నేర్చుకున్నానని పృథ్వీ తెలిపారు.

ఇప్పుడు కూడా నాజర్ మనం సినిమా చేద్దామని చెబుతారని పృథ్వీ అన్నారు.

పెళ్లి సినిమా తర్వాత నాకు రెండు నెలల పాటు ఒక్క సినిమా ఆఫర్ రాలేదని అదే సమయంలో నాకు తెలుగు రాదని ఆయన కామెంట్లు చేశారు.మీ వల్ల అనే పదం మీనింగ్ అర్థం కాకపోవడం వల్ల ఇబ్బంది పడ్డానని ఆయన చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో చావును దగ్గరినుంచి చూశానని పృథ్వీరాజ్ తెలిపరు ప్రేమించాను నిన్నే అనే సినిమాలో నేను నటించానని ఆ సినిమాలో రోజ్ వాటర్ ఫాల్ లో పడే సీన్ ఉంటుందని పృథ్వీ అన్నారు.

సీన్ సమయంలో రోప్ మిస్ కావడంతో వాటర్ ఫాల్ లో అలాగే ముందుకు వెళ్లిపోయానని ఆ సమయంలో కళ్లు మూసుకొనిపోయాయని కళ్లలో వైట్ గా పెద్ద లైట్ కనిపించిందని ఆ సమయంలో స్టంట్ మాస్టర్ వేసిన రోప్ ను పట్టుకుని పైకి వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు.

డాక్టర్లను కలిసి అది నియర్ డెత్ సిండ్రోమ్ అని చెప్పారని పృథ్వీ కామెంట్లు చేశారు.అప్పటినుంచి ఇప్పటివరకు వాటర్ అంటే ఫోబియా అని పృథ్వీ కామెంట్లు చేశారు.

Telugu Syndrome, Nazar, Pruthwiraj, Tollywood-Movie

రోడ్ క్రాస్ చేయడం అన్నా, హైట్ అంటే ఫోబియా అని పృథ్వీ వెల్లడించడం గమనార్హం.ఎన్నో జాగ్రత్తలు తీసుకుని రోడ్డు దాటతానని పృథ్వీ చెప్పుకొచ్చారు.పెళ్లి తర్వాత అలాంటి సైకో పాత్రను నేను మళ్లీ చేయలేదని ఆయన తెలిపారు.కోడి రామకృష్ణ గారి వల్లే ఆ సినిమాలో అద్భుతంగా చేశానని ఆయన చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube