హద్దులు మీరుతున్న సైనిక పాలన.. మయన్మార్‌లో కొనసాగుతున్న అరాచకం.. ?

మయన్మార్ లో దాదాపు రెండు నెలలుగా సైనిక పాలనకు వ్యతిరేకంగా గొంతెత్తుతున్న ప్రజలపై అణచివేత ధోరణిని కొనసాగిస్తుంది అక్కడి సైనిక ప్రభుత్వం.ఈ క్రమంలో తీవ్రంగా చెలరేగుతున్న ఆందోళనలో నిరసనకారుల పై సైన్యం జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి న్యాయవాదులు, మీడియా విడుదల చేసిన నివేదికలో తేలింది.

 Myanmar, Provocative, Army Forces, Kill, Deadliest-TeluguStop.com

కేవలం తుపాకీతో కాల్చడం వల్లే 90 శాతం మంది చనిపోయారని, నిన్న ఒక్క శనివారమే 114 మంది ఆందోళనకారులు సైన్యం తూటాలకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది.ఇకపోతే సైనికుల తూటాలకు బలైన వారిలో అత్యధికంగా చిన్న పిల్లలే ఉన్నారని అక్కడి మీడియా వెల్లడించింది.

ఇదిలా ఉండగా సైనిక తిరుబాటును వ్యతిరేకిస్తూ యమన్మార్ దేశ ప్రజలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

ప్రతి రోజూ ప్రజలు ఆందోళనలు చేయడం, సాయుధ బలగాలు వారిపై దాడి చేసి అణచివేయడం ఆ సైన్యానికి ఒక అలవాటుగా మారింది.

ఇలా రోజు రోజుకు అత్యంత దారుణంగా వ్యవహరిస్తోన్న సైనిక ప్రభుత్వం, ప్రజాస్వామ్యాన్ని రక్షించి, ప్రజలను కాపాడటానికే ప్రయత్నిస్తున్నామని, తన చర్యలను సమర్ధించుకుంటు హద్దులు మీరుతుందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube