పోలీసుల కాల్పుల్లో యువకుడి మృతి: భగ్గుమన్న మిన్నెసోటా

ఓ వ్యక్తిని పోలీస్ అధికారి కాల్చి చంపడాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు నిర్వహించిన ర్యాలీతో మిన్నెసోటా అట్టుడికింది.శనివారం రాత్రి 10.30 ప్రాంతంలో బ్రియాన్ క్వినోన్స్‌ అనే 30 ఏళ్ల యువకుడిని రిచ్‌ఫీల్డ్, ఎడినా పోలీసులు వెంబడిస్తున్నారు.ఆ సమయంలో బ్రియాన్ తన మొబైల్ ఫోన్‌లో ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్ ఆన్ చేసి ఈ తతాంగాన్ని లైవ్ ఇచ్చాడు.

 Protests Inminnesota Over Officerinvolved Shooting1-TeluguStop.com

ఆ వీడియోలో ఒక కారులోంచి క్వినోన్ కిందకు దూకాడు.ఆ సమయంలో అతని చేతిలో తుపాకి వుంది.బ్రియాన్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు అతనిపై కాల్పులు జరుపుతూనే ఉన్నారు.ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారి కాల్చిన బుల్లెట్ క్వినోన్స్ శరీరాన్ని చీల్చుకుంటూ బయటకు వెళ్లడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

ఈ సన్నివేశాన్ని ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్‌ ద్వారా మృతుడి కుటుంబసభ్యులు, కొందరు స్నేహితులు చూశారు.

Telugu Involved, Minnesota, Quinon, Telugu Nri Ups-

  దీనిని నిరసిస్తూ బ్రియాన్ క్వినోన్స్ కుటుంబసభ్యులు, పౌరులు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు సంస్మరణ సభను ఏర్పాటు చేశారు.అనంతరం ఏడు గంటలకు కొవ్వొత్తులు పట్టుకుని ర్యాలీగా బ్రియాన్‌ను కాల్చిన ప్రదేశానికి చేరుకుని.పోర్ట్‌ల్యాండ్ అవెన్యూ వద్ద ఐ-494 హైవేను దిగ్భందించారు.

దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.దీనిపై స్పందించిన పోలీస్ శాఖ కాల్పుల ఘటనపై విచారణకు ఆదేశించడంతో పాటు కొన్ని వివరాలను విడుదల చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube