అమెరికా: నల్లజాతీయుడిని కాల్చిచంపిన శ్వేతజాతి పోలీస్ అధికారి.. నార్త్ కరోలినాలో భగ్గుమన్న నిరసనలు

అమెరికాలో మరోసారి శ్వేతజాతి దురహంకారం బుసలు కొట్టింది.నిరాయుధుడైన ఆఫ్రికన్ అమెరికన్ వ్యక్తిని శ్వేతజాతి పోలీసు అధికారి కాల్చిచంపడం నార్త్ కరోలినాలో ఉద్రిక్తతలకు దారి తీసింది.

 Protests In Us After White Off-duty Officer Shot Dead Black Man, Us, White Off D-TeluguStop.com

అక్కడి నివాసితులు, బాధితుడి బంధువులు గురువారం రాత్రి నిరసనలకు దిగారు.మృతుడిని జాసన్ వాకర్‌గా గుర్తించారు.అతనిని కాల్చి చంపిన ఆఫ్ డ్యూటీ పోలీసు అధికారి జెఫ్రీ హాష్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు నగరంలో నిరసనకు దిగారు.2005 నుంచి నగరంలో ఉద్యోగం చేస్తున్న నిందితుడైన అధికారి తన భార్య, కుమార్తెతో కలిసి కారులో వెళ్తుండగా.రోడ్డు దాటుతున్న 37 ఏళ్ల బాధితుడు వాకర్‌ను సమీపించారు.అయితే ఏం జరిగిందో ఏమో కానీ హాష్ కాల్పులు జరపగా.తీవ్రగాయాలతో వాకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

అయితే వాకర్ సడెన్‌గా రోడ్డు మధ్యలోకి వచ్చాడని.

అతనిని తప్పించుకోవడానికి బ్రేక్ వేశానని సదరు పోలీస్ అధికారి వివరణ ఇచ్చాడు.ఈ క్రమంలో వాహనంపైన వున్న విండ్‌షీల్డ్ వైపర్‌ను చించి దానితో కొట్టేందుకు యత్నించాడని.

తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి తుపాకీతో కాల్పులు జరిపినట్లుగా హాష్ చెప్పాడు.ఇంత జరిగినా నిందితుడైన అధికారిని అడ్మినిస్ట్రేటివ్ లీవ్‌లో వుంచారు తప్పించి.

అతనిని అరెస్ట్ చేయడం కానీ, నేరం మోపడం కానీ చేయలేదు.అయితే దర్యాప్తు అధికారులు మాత్రం హత్యపై విచారణ ప్రారంభించారు.

డ్యూటీలో లేని అధికారి వాకర్‌ను ఎందుకు కాల్చి చంపాడో చెప్పాలంటూ బాధితుడి కుటుంబం డిమాండ్ చేస్తోంది.అధికారిక గణాంకాల ప్రకారం.

యూఎస్ పోలీస్ అధికారులు ప్రతి ఏడాది సగటున 1000 మందిని చంపుతున్నారు.వీరిలో అత్యధిక శాతం మంది ఆఫ్రికన్ అమెరికన్లే.

కాగా, మిన్నెసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్ నగరంలో జార్జ్ ఫ్లాయిడ్ (46) అనే ఓ నల్ల జాతి వ్యక్తిని పోలీసులు అరెస్టు చేస్తుండగా చనిపోయిన సంగతి తెలిసిందే.2020 మే 25న జరిగిన ఈ ఘటన కారణంగా అమెరికాలోని అనేక నగరాలు రగిలిపోయాయి.ఫ్లాయిడ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మెడపై గట్టిగా నొక్కిపట్టడంతో అతని ఊపిరాడక మరణించాడు.తనకు ఊపిరాడటం లేదని ఫ్లాయిడ్‌ అరుస్తున్నా పట్టించుకోకుండా పోలీసులు క్రూరంగా వ్యవహరించినట్లు వైరల్ అయిన వీడియోలలో ఉంది.

ఈ క్రమంలో జార్జ్‌ఫ్లాయిడ్ ఆక్సిజన్ అందకే మరణించాడని వైద్యుడు తెలిపారు.వివాదాస్పద పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్ మోకాలు అతని మెడపై ఉండటం వల్ల అతను ఊపిరి ఆడక ప్రాణాలు వదిలాడని డాక్టర్ వాంగ్మూలం ఇచ్చారు.దీంతో చౌవిన్‌కు 22.5 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.

Protests In US After White Off-duty Officer Shot Dead Black Man, US, White Off Duty Officer,Administrative Leave, George Floyd, Jason Walker,Jason Walker Death, George Floyd Death - Telugu Black, George Floyd, Jason Walker, White Duty

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube