షర్మిలకు తగిలిన నిరసన సెగలు... అసలు కారణం ఇదే?

తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే.ఇటు ఈటెల అంశం ఒకెత్తయితే, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే.

 Protests Against Sharmila Is This The Real Reason , Sharmila , Telangana Politic-TeluguStop.com

అయితే దీనిపై తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్న విషయం తెలిసిందే.అయితే తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభించిన షర్మిల ఈ వివాదంపై స్పందించిన విషయం తెలిసిందే.

అయితే ఆంధ్ర పరిరక్షణ సమితి నాయకులు లోటస్ పాండ్ లోని కార్యాలయంలో నిరసనకు దిగారు.తెలంగాణకు నష్టం కలిగే విధంగా ఆంధ్ర ప్రాజెక్టులు నిర్మిస్తే చూస్తూ ఊరుకునేది లేదని షర్మిల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగనున్నది.అయితే ఇప్పటికే త్వరలో తెలంగాణలో రాజన్న రాజ్యం వస్తుందని, ప్రజలు రాజన్న రాజ్యం కావాలని కోరుకుంటున్నారని తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని చెబుతున్న షర్మిల ప్రజల మనసులు గెలుచుకోవడంలో విఫలమవుతూ వస్తోంది.

ప్రజల్లోకి అంతగా వెళ్లని షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా ఉన్న అంశాలపై స్పందిస్తూ వార్తలలో నిలుస్తున్నారే తప్ప పెద్దగా క్షేత్ర స్థాయి సమస్యలపై స్పందించడం లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.  మరి షర్మిల పార్టీ ప్రస్థానం తెలంగాణలో  ఏవిధంగా ఉంటుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube