కెనడా: రెండుగా చీలిన భారతీయులు.. ‘‘కలిసి ఉంటే కలదు సుఖం’’ అంటున్న మాజీ సైనికులు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత మూడు నెలలుగా రైతులు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.అన్నదాతలకు మద్ధతుగా దేశంలోని కార్మిక, కర్షక, విపక్షాలు మద్ధతు తెలిపాయి.

 Canada: Armed Forces Veterans Body Seeks To End Rift Over India's Farm Laws, Can-TeluguStop.com

అంతర్జాతీయ సమాజం కూడా రైతులకు బాసటగా నిలుస్తోంది.యూకే, యూఎస్, కెనడాలలోని ఎన్ఆర్ఐలు, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌బెర్గ్, ప్రముఖ పాప్ సింగర్ రెహానాలు సైతం అన్నదాతలకు మద్ధతు పలికారు.

ఇటీవల బ్రిటన్ పార్లమెంట్‌లో వ్యవసాయ చట్టాలపై చర్చ జరగడం.దీనిపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

రైతులకు మద్ధతుగా వుండటం మంచిదే కానీ ఇది కెనడాలో భారతీయ సమాజాన్ని రెండుగా చీల్చింది.భారత ప్రభుత్వానికి అండగా నిలిచేవాళ్లు ఒకరైతే.

ఖలిస్తానీ వేర్పాటు వాదులు మరో వర్గం.

అయితే భారత ప్రభుత్వం- రైతులకు మద్ధతు తెలుపుతూ కెనడాలో భారతీయ వర్గం మధ్య విభేదాలు పెరిగిపోతున్నాయి.

దీనిని పరిష్కరించడానికి భారత్, కెనడాలలోని సాయుధ దళాల్లో పనిచేసిన భారత సంతతికి చెందిన మాజీ సైనికుల సంఘం వెటరన్స్ అసోసియేషన్ ఆఫ్ అంటారియో నడుం బిగించింది.ప్రధానంగా ఇండో- కెనడియన్ సమాజం మధ్య విభేదాలను పరిష్కరించడానికి వీరు హిందూ- సిక్కు సంస్థల ప్రతినిధులను ఒక చోటకు చేర్చుతున్నారు.

అసోసియేషన్ ఛైర్మన్ బ్రిగేడియర్ (రిటైర్డ్) నవాబ్ హీర్ మీడియాతో మాట్లాడుతూ.మనలో మనకు ఉద్రిక్తతలు తలెత్తడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు.కెనడాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు అభివృద్ధి చెందాలంటే , అంతా కలిసే వుండాలని నవాబ్ విజ్ఞప్తి చేశారు.గురుద్వారా వంటి మతపరమైన సంస్థల ద్వారా సామరస్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Telugu Canada, Canadaveterans, Htds-Telugu NRI

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలలో పాల్గొంటున్న భారతదేశానికి చెందిన విద్యార్ధులకు సైతం కౌన్సెలింగ్ ఇవ్వాలని అసోసియేషన్ పెద్దలు నిర్ణయించారు.కాగా చట్టాలకు అనుకూలంగా భారత ప్రభుత్వానికి మద్ధతు తెలుపుతున్న వర్గాలను టార్గెట్ చేసుకున్న ఖలిస్తానీలు వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారు.ముఖ్యంగా ఫిబ్రవరి 28న గ్రేటర్ టొరంటో‌ ప్రాంతంలో ఇండో – కెనడియన్ సమాజం నిర్వహించిన ‘‘తిరంగా- మాపుల్ ’’ కారు ర్యాలీని అడ్డుకున్న ఖలిస్తానీలు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు.దీనికి ప్రతిగా హిందూ సమాజంలోని కొన్ని వర్గాలు సిక్కు రెస్టారెంట్లు, సంస్థలను బహిష్కరించాల్సిందిగా గురుద్వారాల వెలుపల ఎదుట నిరసనలకు దిగాయి.

ఇది మరింత శృతిమించితే కెనడాలో భారతీ సమాజం మనుగడపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం వుందని భావించిన ఈ వెటరన్స్ అసోసియేషన్ సానుకూల వాతావరణాన్ని కల్పించేందుకు సిద్ధమైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube