రైతులకు మద్ధతు.. కమలా హ్యారిస్ మేనకోడలికి నిరసన సెగ: భయపడనన్న మీనా..!!

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో గత రెండు నెలలుగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.అన్ని రోజులూ ప్రశాంతంగా తమ నిరసన తెలియజేసిన అన్నదాతలు రిపబ్లిక్ డే రోజున మాత్రం కాస్త హద్దు దాటారు.

 Protestors Burn Meena Harris' Pics, After Her Tweet On Supporting Farmer's Prote-TeluguStop.com

ట్రాక్టర్ ర్యాలీ పేరిట రాజధానిలోకి చొచ్చుకొచ్చి విధ్వంసం సృష్టించారు.పోలీసులపై దాడులు చేయడంతో పాటు ఏకంగా ఎర్రకోటను ముట్టడించి రైతు సంఘాల జెండాలను ఎగురవేశారు.

నాటి నుంచి రైతుల ఉద్యమంపై అంతర్జాతీయ సమాజం ఫోకస్ చేయడం మొదలుపెట్టింది.ఇదే సమయంలో పాప్ సింగర్ రిహానా, పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌బెర్గ్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ మేనకోడలు మీనా హారిస్‌లు రైతులకు మద్ధతుగా ట్వీట్ చేశారు.

దీంతో భారత్‌లోని సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు భగ్గుమన్నారు.తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

గ్రేటాపై ఢిల్లీ పోలీసులు కేసు పెట్టారు. రిహనా మీద ఆమె వ్యక్తిత్వాన్ని, వ్యక్తిగత అంశాలను లక్ష్యంగా పెట్టుకుని సామాజిక మాధ్యమాలలోనే దాడి జరుగుతోంది.అంతేకాదు, అంతర్జాతీయ పాప్ తారపై పోటీగా లతా మంగేష్కర్ దగ్గర నుంచి సచిన్ టెండూల్కర్ దాకా మండిపడుతున్నారు.ఇప్పుడు మీనా హారిస్ వంతు వచ్చింది.

ఆమెపై యునైటెడ్ హిందూ ఫ్రంట్ కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలో శుక్రవారం దిష్టి బొమ్మలను, పోస్టర్లను దగ్ధం చేశారు.

భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీయులు జోక్యం చేసుకుంటే సహించబోమని నినాదాలు చేశారు.ఈ విషయాన్ని గురించి తెలుసుకున్న మీనా హ్యారిస్ సైతం ఘాటుగానే బదులిచ్చారు.

తాను ఇండియాలోని రైతుల మానవ హక్కులను కాపాడటం కోసం మాట్లాడానని… ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూడాలంటూ మీనా ట్వీట్ చేశారు.నేనిలానే మాట్లాడతానని.ప్రపంచంలోని అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశంలో నెల రోజుల క్రితం ఏం జరిగిందో చూశామంటూ వాషింగ్టన్‌ లోని క్యాపిటల్ భవనంపై జరిగిన దాడిని మీనా హారిస్ ప్రస్తావించారు.ఇప్పుడు అత్యధిక జనాభా ఉన్న దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.

భారత్‌లో ఇంటర్నెట్‌ను ఆపేస్తున్నారని, పారామిలిటరీ దళాలు రైతులపై దాడులు చేస్తున్నాయంటూ మీనా హారిస్ భగ్గుమన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube