కోనసీమ లో ఉద్రిక్తం ! అమలాపురం అస్టదిగ్బంధం 

కోనసీమ జిల్లాలు అంబేద్కర్ కోనసీమ జిల్లా గా మార్చడం పై ఆ ప్రాంతంలో రాజుకున్న చిచ్చు ఇప్పుడు ఓ మంత్రి , ఎమ్మెల్యే ఇంటి దహనం,  ప్రభుత్వ ప్రైవేటు బస్సుల దహనం వరకు వెళ్ళింది.కోనసీమ జిల్లాకు ప్రధాన కేంద్రంగా ఉన్న అమలాపురంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

 Protesters  Set  Fire  To A Ministers House In Amalapuram Over The Renaming Of K-TeluguStop.com

కోనసీమ జిల్లా పేరు మార్పు పై కోనసీమ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు ఈ విధంగా హింసాత్మకంగా మారాయి.కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లాగా మార్చడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళన కార్యక్రమం హింసాత్మకంగా మారింది.ఏపీ మంత్రి విశ్వరూప్ ఇంటితో పాటు,,  ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటి పైన దాడి చేసి వాహనాలు తగలబెట్టడం, రాళ్లు విసరడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

        ఈ ఘటనలో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా ఈ వ్యవహారం సంచలనంగా మారింది.ఇంకా అమలాపురంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పూర్తిగా  అమలాపురం ను అష్ట దిగ్బంధనం చేశారు.భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి కొత్త వారు ఇక్కడ కు రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు .పోలీసు ఉన్నతాధికారులు అమలాపురంలోని మకాం వేశారు. కోనసీమ జిల్లా పేరు మార్పు పై రెండు వర్గాలు ఆందోళన కు పిలుపు నివ్వడంతో , ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.

అదేవిధంగా అమలాపురం డిపో నుంచి బస్సు సర్వీసులను కూడా తాత్కాలికంగా రద్దు చేశారు.   

Telugu Amalapuram, Drbr, Jagan, Konaseema, Mlaponnada-Politics

    ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బస్సులను కూడా ప్రయాణికులు లేకుండానే వెనక్కి పంపిస్తున్నారు.ప్రస్తుతం అమలాపురం లో 144 సెక్షన్ అవుతోంది.ఆందోళనకారులు చలో రావులపాలెం అంటూ పిలుపునివ్వడంతో,  దానిని అడ్డుకునేందుకు భారీగా పోలీసులను మోహరించారు.పరిస్థితిని ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష చేస్తున్నారు.ఏపీ సీఎం జగన్ ప్రస్తుతం విదేశాల్లో ఉండడం తో అక్కడి నుంచే ఎప్పటికప్పుడు ఇక్కడి పరిస్థితి పై ఆరా తీస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube