అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం గత బుధవారం యూఎస్ కాంగ్రెస్. క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.
ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.
వారిని శాంతింపజేసేందుకు పోలీసులు తొలుత టియర్ గ్యాస్ ప్రదర్శించినప్పటికీ లాభం లేకపోయింది.దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో తూటాలకు పనిచెప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనతో తమ నిబంధనలు ఉల్లంఘించేలా వ్యవహరించారంటూ సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లు ట్రంప్ ఖాతాను బ్లాక్ చేశాయి.అయితే ఒక అడుగు ముందుకేసిన ట్విట్టర్ ఆయన ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది.
ఇంటా బయటా వస్తున్న తలనొప్పులకు తోడు తమ అభిమాన నేత ఖాతాను ట్విట్టర్ పర్మినెంట్ బ్లాక్ చేయడంతో ఆయన వర్గీయులు భగ్గుమన్నారు.ట్విట్టర్ వ్యవహారశైలిని నిరసించడంతో పాటు ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలని కోరుతూ వారు మరోసారి బీభత్సం చేయాలని భావించారు.

శాన్‌ఫ్రాన్సిస్కోలో వున్న ట్విట్టర్ ప్రధాన కార్యాలయం ఎదుట సోమవారం ట్రంప్ మద్దతుదారులు, అభిమానులు ఆందోళన చేయాలని సిద్ధమయ్యారు.అయితే ఈ విషయం ముందే పసిగట్టిన పోలీసులు ఎలాంటి హింసకు తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.కట్టుదిట్టమైన భద్రత వుండటంతో వారి పప్పులు ఉడకలేదు.భద్రతా దళాలను చూసి భయపడిన ట్రంప్ మద్ధతుదారులు చాలా తక్కువ సంఖ్యలోనే అక్కడికి హాజరవ్వడంతో కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
మరోవైపు అన్ని వర్గాల నుంచి ట్రంప్‌ను అధ్యక్షుడిగా తొలగించాలనే డిమాండ్ వస్తుండటంతో ఆయనపై డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు.ఈ తీర్మానానికి రిపబ్లికన్లు కూడా మద్ధతు తెలపడం విశేషం.
దిగువ సభలో డెమొక్రాటిక్ పార్టీ సభా నాయకుడిగా వ్యవహరిస్తున్న డేవిడ్ సిసిలీన్ ఈ అభిశంసన తీర్మానాన్ని తయారు చేశారు.దీనికి 185 మంది మద్ధతు తెలిపారు.
దీనిపై బుధవారం ఓటింగ్ జరగనుంది.ఇక్కడ అభిశంసన తీర్మానంపై ఆమోదం లభించిన తర్వాత దానిని సెనేట్‌కు పంపిస్తారు.—
.