స్కూటీపై వెళ్తున్న న్యాయవాదిను కారుతో ఢీ కొట్టి.. రాళ్లతో దాడి చేసి దారుణ హత్య..!

Property Disputes Takes Life Of An Woman Advocate In Karnataka Details, Property Disputes , Woman Advocate ,karnataka, Majat Sulthan, Kalaburigi, Saddam, Karnataka Crime, Property Issue

న్యాయవాది, సామాజిక కార్యకర్త అయిన ఓ మహిళ ( Woman ) స్కూటీపై వెళ్తుండగా కొంతమంది దుండగులు కారుతో ఢీ కొట్టి, రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు.ఈ సంఘటన కర్ణాటకలోని ( Karnataka ) కలబురగి జిల్లాలో బుధవారం స్థానికంగా కలకలం రేపింది.

 Property Disputes Takes Life Of An Woman Advocate In Karnataka Details, Property-TeluguStop.com

పోలీసులకు సమాచారం అందడంతో, హుటాహుటిన డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణుల బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల విచారణలో న్యాయవాది అయిన మజత్ సుల్తాన్,( Majat Sulthan ) భర్త సద్దాం తో కలిసి కలబురగిలో నివసిస్తోంది.

అయితే సద్దాంకు నదీమ్, నసీమ్ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు.కానీ అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల విషయంలో తరచూ గొడవలు జరిగేవి.ఈ క్రమంలో సద్దాం, తన భార్యతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

బుధవారం పాత ఇంటి నుండి కొత్త ఇంటికి వస్తువులను తరలిస్తున్న క్రమంలో మజత్ స్కూటీని వెంబడించి కారుతో బలంగా ఢీ కొట్టి, ఆమెపై రాళ్ల దాడి చేసి దారుణంగా హత్య చేసి దుండగులు పరారయ్యారు.పోలీసులకు సమాచారం అందడంతో సీపీ చేతన్, డీసీపీ అద్దూరు శ్రీనివాసులు సంఘటన స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందంతో దర్యాప్తు చేయగా ఆమె ఒక న్యాయవాది అని గుర్తించారు.

మజత్ స్కూటీపై వెళ్తుండగా.దుండగులు దాడి చేసి హత్య చేసినట్టుగా ప్రాథమికంగా బయటపడింది.మజత్ భర్త సద్దాంను విచారించగా తన సోదరులకు తనకు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని, అందుకే వేరే ఇంటికి మారే సమయంలో ఈ దారుణం జరిగిందని, ఇందుకు తన సోదరులతో పాటు అజీమ్ గౌడి, వసీం గౌడి అనే వ్యక్తులు కలిసి, తన భార్యను చంపారని ఫిర్యాదు చేశాడు.

గతంలో కూడా ఆస్తి తగాదాలతో తాము రెండుసార్లు జైలుకు కూడా వెళ్ళామని సద్దాం పోలీసులకు తెలిపాడు.సద్దాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, అన్నీ కోణాల్లో ఈ హత్య వెనక ఎవరెవరున్నారు.? హత్యకు గల కారణాలు ఏమిటో త్వరలోనే బయటకి వస్తాయని పోలీసులు తెలిపారు.

Video : స్కూటీపై వెళ్తున్న న్యాయవాదిను కారుతో ఢీ కొట్టి రాళ్ల #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube