మళ్లీ ఆ పని చేయనంటూ భార్యకు మాట ఇచ్చాడట

సినిమా ఇండస్ట్రీలో రాణించాలని ఎంతో మంది హైదరాబాద్‌కు వస్తూ ఉంటారు.అందులో ఎంతో మంది అవకాశాలు లేక వెనక్కు వెళ్లి పోతారు, కొందరు మాత్రం రానిస్తారు.

 Promise To His Wife That He Will Not Do That Again-TeluguStop.com

కమెడియన్‌ ధన్‌ రాజ్‌ కూడా చాలా చాలా కష్టపడి అవకాశాలు దక్కించుకున్నాడు.సినిమాల్లో అడపా దడపా చిత్రాలు చేస్తున్న సమయంలోనే ఆయనకు జబర్దస్త్‌ కమెడియన్‌ గా ఛాన్స్‌ దక్కింది.

జబర్దస్త్‌తో స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్న ధన్‌రాజ్‌కు హీరోగా కూడా అవకాశాలు వచ్చాయి.హీరోగా ఆయన నటించిన ఒక సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించాడు.

నిర్మాతగా వ్యవహరించిన సినిమా ఆడక పోవడంతో ధన్‌ రాజ్‌ చాలా నష్టపోయాడట.దాంతో ఆర్థికంగా ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నట్లుగా తెలుస్తోంది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో ధన్‌ రాజ్‌ మాట్లాడుతూ.హీరోగా చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది.

నాకు కూడా హీరోగా చేయాలని అనిపించింది.ఆ సమయంలోనే నిర్మాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కారణంగా నేను కూడా నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వాల్సి వచ్చింది.

అంతే తప్ప నాకు నిర్మాణంపై ఆసక్తి లేదని ధన్‌ రాజ్‌ చెప్పుకొచ్చాడు.

ఆర్థికంగా నష్టపోయిన కారణంగా మరోసారి నిర్మాతగా సినిమా చేయను అని తన భార్యకు మాట ఇచ్చాడట.ఆర్థికంగా సరిగా లేని సమయంలో నిర్మాణంలో అడుగు పెట్టడం ఎంత పెద్ద తప్పు నాకు ఒక్క సినిమాతోనే తెలిసి పోయింది.అందుకే నా భార్యకు మరోసారి నిర్మాణంలో అడుగు పెట్టను అంటూ మాట ఇచ్చాను.

ఆ మాట ప్రకారం ఇకపై పూర్తిగా నటనపై మాత్రమే దృష్టి పెడతాను అంటూ ధన్‌ రాజ్‌ చెప్పుకొచ్చాడు.భవిష్యత్తులో ఎంత సంపాదించినా, ఎలాంటి మంచి ఆఫర్‌ వచ్చినా కూడా నిర్మాతగా మాత్రం డబ్బులు పెట్టేందుకు ఆసక్తిగా లేను అంటూ క్లారిటీ ఇచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube