అమెరికా గుర్తించిన...'ఆంధ్రా ప్రొఫెసర్'  

Professor Prasanna Sri Record Recognised By America-

ఆంధ్ర ప్రదేశ్ లోని ఆంధ్ర విశ్వవిద్యాలం ప్రొఫెసర్ ప్రతిభని అమెరికా గుర్తించింది అందుకు గాను ఆమెని అభినందించింది. అంతరించి పోయే బాషలలో చాలా బాషలకి లిపులని నూతనంగా తయారు చేయడం అంటే మామూలు విషయం కాదు అయితే. ప్రపంచంలో ఎన్నో గిరిజన బాషలు అంతరించి పోతుండగా పలు లిపిలేని భాషలకి నూతనంగా లిపులతో కూడిన.

అమెరికా గుర్తించిన...'ఆంధ్రా ప్రొఫెసర్'-Professor Prasanna Sri Record Recognised By America

ఓ అట్లాస్ ని తయారు చేసి దాని సాఫ్ట్ ప్రతిని విడుదల చేసింది మేరికాకి చెందిన ఎన్‌డేంజర్డ్‌ ఆల్ఫాబెట్స్‌ సంస్థ. అయితే ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని ఆంద్ర విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ విభాగం ప్రొఫెసర్ ప్రసన్న శ్రీ రికార్డు సృష్టించారు.

అమెరికాకు చెందినా ఆ సంస్థ సాఫ్ట్‌ ప్రతిలో అత్యధిక భాషలకు లిపి తయారుచేసిన మహిళగా ఆచార్య ప్రసన్నశ్రీని గుర్తించి ఆ సమాచారాన్ని ఆమెకి పంపించారు..

ఆమెకి పంపిన అట్లాస్‌లో ప్రసన్నశ్రీ తయారు చేసిన 18 భాషల లిపులను ఉంచారు. ఆయా భాషలు మాట్లాడే జాతులపై ఆమె చేసిన గొప్ప పరిశోధనల్లోని ప్రధాన అంశాలని సైతం దానపై ప్రస్తావించారు. ఈ అరుదైన గౌరవం దక్కిన్చుకున్నందుకు ఏయూ విశ్వవిద్యాలయం అభినందనలు తెలిపింది.