ఆయన ఓ ప్రొఫెసర్...అమ్మాయిల కన్యత్వంపై ఫేస్బుక్ లో ఎలాంటి పోస్ట్ పెట్టాడో తెలుసా.? చూస్తే తిట్టుకుంటారు!

అమ్మాయిల కన్యత్వంపై ఓ ఫ్రొఫెసర్‌ అభ్యంతకర వ్యాఖ్యలు చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు.ఆయన ఓ ప్రొఫెసర్.

 Professor Kanak Sarkar Speks About Womens Virginity-TeluguStop.com

యువతీ, యువకులకు తన బోధనలతో మంచి బుద్ధులు నేర్పించాల్సిన అత్యుత్తమ స్థానంలో ఉన్న అతను… అమ్మాయిల వర్జినిటీ విషయంలో ఓ పిచ్చి పోస్ట్ పెట్టి, తన మూర్ఖత్వాన్ని బయటపెట్టుకున్నాడు.కోల్‌కతాలో జాధవ్‌పూర్‌ యూనివర్సిటీకి చెందిన కనక్‌ సర్కార్‌ అనే ఫ్రొఫెసర్‌ ఫేస్‌బుక్‌లో వరుసగా పోస్ట్‌లు చేశాడు.

ఈ పోస్ట్‌లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంకావడంతో ఫ్రొఫెసర్‌ ఆ పోస్ట్‌లను తొలిగించాడు.ఇంతకీ ఆ పోస్టులు ఏంటో చూడండి.

‘అబ్బాయిలు.సీల్‌ ఊడిన కూల్‌ డ్రింక్స్‌ కొంటారా? అలాంటప్పుడు కన్యత్వం కోల్పోయిన అమ్మాయిలను ఎలా పెళ్లి చేసుకుంటారు? అబ్బాయిలు కన్యత్వం కలిగిన యువతుల విషయంలో మోసపోతున్నారు.వర్జినిటీ కలిగిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే లభించే లాభాల గురించి వారికి అవగాహన లేదు.కన్యత్వం కలిగిన అమ్మాయిలు దేవదూతలు’ అంటూ ఫేస్బుక్ లో పోస్ట్ చేసాడు.

జపాన్‌లో 99 శాతం మంది అమ్మాయిలు పెళ్లయ్యేదాకా వర్జినిటీ కోల్పోరని… అందుకే వారి దేశం అభివృద్ది చెందిందని చెప్పుకొచ్చాడు.సరదాగానో లేక ఫ్రస్టేషన్‌తోనే పెట్టిన పోస్ట్ మీద వివాదం చెలరేగడంతో వెంటనే దాన్ని డిలీట్ చేసేశారు సదరు 20 ఏళ్ల అనుభవం కలిగిన ప్రొఫెసర్.అయితే అప్పటికే ఆ పోస్ట్ స్క్రీన్ షాట్స్ రూపంలో విద్యార్థులు సేవ్ చేసుకోవడం, దాన్ని విపరీతంగా షేర్ చేసేయడంతో వైరల్ అయిపోయింది.అయితే ఓ ఫ్రొఫెసర్‌ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఏంటని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube