ఉన్నత పదవి కోసం “మహిళా ప్రొఫిసర్” ఏమి చేసిందో తెలిస్తే షాకే       2018-04-18   06:21:09  IST  Raghu V

పాఠాలు చెప్పవలసిన గురువులో వ్యభిచార కూపంలోకి నెట్టేస్తున్న తరుణంలో విద్యా వ్యవస్థ సైతం కలుషితం అయిపోతోంది పిల్లల్లు గురువుల వద్ద ఉంటే తల్లి తండ్రులకి ఎంతో భరోసాగా ఉంటుంది అటువంటిది గురువులే తమ పిల్లల జీవితాలని నాశనం చేయాలనీ ప్రయత్నిస్తుంటే ఎలా తట్టుకోగలరు విద్యా వ్యవస్థలపై నమ్మకం ఎలా కలుగుతుంది..వివరాలలోకి వెళ్తే

ఒక కీచక మహిళా ప్రొఫెసర్ తన ఉన్నతమైన పదవుల కోసం వైస్ చాన్సలర్ పదవి కోసం తన దగ్గర చదువుకునే విధ్యర్దినులకి ఉచిత డిగ్రీలు ఇప్పిస్తామని చెప్తూ ఉన్నత అధికారుల వద్ద పడుకో పెట్టడానికి పంపుతోంది..ఈ వివాదంలో తమిళ నాడు గవర్నర్ భన్వరిలాల్ పూరోహిత్ పేరు కూడా వినిపించడం తో ఒక్క సారిగా తమిళ నాడు రాష్ట్రం ఉలిక్కి పడింది ఒక్క సారిగా ఏపీ మాజీ గవర్నర్ ఎన్.డి. తివారీలా గుర్తుకు వచ్చారు..

అయితే ఈ మహిళా ప్రొఫెసర్ నలుగురు విధ్యర్దినులకి ఉచిత డిగ్రీలు వస్తాయి అంటూ వాటిని ఎరగా చూపి గవర్నర్ వద్దకి పంపడానికి వ్యూహం రచించింది..దీనికి సంబంధించిన ఆడియో ఒకటి ఇపుడు లీకు కాగా, ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది…ఆ మహిళా ప్రొఫిసర్ చెప్పిన వివరాల ప్రకారం ఎలాగైనా వైస్‌ఛాన్సలర్‌ కావాలనుకున్నానని, అందుకే విద్యార్థినిలపై ఒత్తిడి చేసినట్టు యూనివర్శిటీ విద్యార్థినిలతో వ్యభిచారం చేయించిన మహిళా ప్రొఫెసర్ నిర్మలాదేవి వెల్లడించారు.


తనకు వీఐపీల పరిచయంలేదని తొలుత నిర్మలాదేవి బుకాయించినా, పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆమె సెల్‌ఫోన్లలో పలువురు వీఐపీల నెంబర్లు ఉన్న విషయాన్ని బయట పెట్టడంతో ఆమె అసలు విషయాన్ని వెల్లడించారు…అయితే నేను కొన్ని విషయాలు వెల్లడిస్తే చాలా మంది పెద్ద వాళ్ళు బయటకి వస్తారు అని హెచ్చరించిందట ఆమె దాంతో ఈ కేసుని డీజీపీ రాజేంద్రన్‌ వెంటనే కేసు విచారణకు సీబీసీఐడికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు…మరోవైపు ఈ కీచక ప్రొఫిసర్ కి సాయం చేస్తున్న మదురై కామరాజర్‌ విశ్వవిద్యాలయం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కరుప్పుస్వామి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతానికి ఈ కేసులో ఉన్న పెద్ద తలకాయలు ఎవరు అనే విషయాలని బయటకి లాగడానికి పోలీసుకు ప్రయత్నాలు చేస్తున్నారు..