భారత్‌లో భారీగా యాపిల్ ఫోన్ల ఉత్పత్తి.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ ఫోన్లకు ఉండే క్రేజే వేరు.ఎంత ఖరీదు ఉన్నా వీటిలో కొత్త మోడల్ రాగానే హాట్ కేకుల్లా అమ్ముడై పోతుంటాయి.

 Production Of Apple Phones In India Union Minister's Key Comments  , Indian, Iph-TeluguStop.com

వీటి తయారీ ఎక్కువగా చైనాలో చేపడుతున్నారు.అక్కడి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతుంటాయి.

ప్రస్తుతం చైనాలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి.కోవిడ్ విజృంభణతో పాటు అక్కడ కంపెనీలలో కార్మికుల తిరుగుబాటు వంటివి యాపిల్ ఫోన్ల తయారీ ప్రతిబంధకంగా మారాయి.

దీంతో భారత్ వైపు యాపిల్ కంపెనీ చూస్తోంది.యాపిల్ ఫోన్ల ఉత్పత్తిలో 25 శాతం వరకు భారత్ లోనే చేపట్టాలని ఆ కంపెనీ భావిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

ప్రభుత్వ పారదర్శక విధానాలు, షరతులు లేని రాయితీల వంటి వ్యాపార అనుకూల వాతావరణం కారణంగా ప్రపంచ కంపెనీలు భారత్‌ను తమ తయారీ స్థావరంగా మార్చుకుంటున్నాయని అన్నారు.

Telugu Indian, Iphone, Latest, Ups-Latest News - Telugu

జీ20 అధికారిక డైలాగ్ ఫోరమ్ బిజినెస్ 20 (B-20) ప్రారంభ సెషన్‌లో గ్లోబల్ కమ్యూనిటీని ఉద్దేశించి గోయల్ మాట్లాడారు.యాపిల్ సంస్థ యొక్క మొత్తం ఉత్పత్తిలో 5 నుండి 7 శాతం ప్రస్తుతం భారతదేశంలోనే జరుగుతోందన్నారు.భవిష్యత్తులో యాపిల్ ఫోన్ల తయారీలో 25% భారత్ లోనే తయారు చేయాలని ఆ కంపెనీ భావిస్తున్నట్లు పేర్కొంది.

Telugu Indian, Iphone, Latest, Ups-Latest News - Telugu

యాపిల్ ఇటీవల తన సరికొత్త హ్యాండ్‌సెట్‌ను భారతదేశంలోనే తయారు చేసింది.యాపిల్ ఐఫోన్లు ఇప్పుడు ‘మేడ్ ఇన్ ఇండియా’గా మారనున్నాయని తెలిపారు.దాని అతిపెద్ద ప్లాంట్ బెంగళూరులో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్ భారతదేశంలో యాపిల్ కోసం ఐఫోన్‌లను తయారు చేస్తాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మెరుస్తున్న నక్షత్రంగా భారత్ ఆవిర్భవించిందని గోయల్ అన్నారు.భారత్‌లో ఉన్నంత అవకాశాలు ప్రపంచంలో మరే మార్కెట్‌లోనూ లేవని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube