సాయి పల్లవి క్రేజ్ నిర్మాతలకి ఆ విధంగా లాభిస్తుంది

సౌత్ లో ప్రస్తుతం మోస్ట్ క్రేజియస్ట్ హీరోయిన్ గా ఉన్న భామ సాయి పల్లవి.అలాగే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటి అంటే కూడా ముందుగా గుర్తుకొచ్చే పేరు సాయి పల్లవి.

 Producers Using Sai Pallavi Craze, Tollywood, Love Story Movie, Viratparvam Movi-TeluguStop.com

ఇప్పుడు అంతా ఆమె ప్రభావం సౌత్ ఇండస్ట్రీలో కనిపిస్తుంది.ప్రస్తుతం తెలుగులో లవ్ స్టొరీ, విరాటపర్వం సినిమాలలో ఈ భామ కనిపిస్తుంది.

అలాగే శ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగ్ దశలో ఉంది.మరో సినిమా కూడా చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తుంది.

తన డాన్స్ టాలెంట్ తో సౌత్ ప్రేక్షకులకి చేరువ అయిన ఈ భామ సాంగ్ యుట్యూబ్ లో రిలీజ్ అయ్యింది అంటే అది చాలా తక్కువ టైంలోనే సెన్సేషన్ అయిపోతుంది.తాజాగా లవ్ స్టొరీ సినిమా నుంచి సాయి పల్లవి మీద చిత్రీకరించిన సారంగాదరియా సాంగ్ చాలా తక్కువ సమయంలో పదికోట్ల మంది ప్రేక్షకులు వీక్షించారు అంటే ఆమెకి ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఈ నేపధ్యంలో ఇప్పుడు సాయి పల్లవి క్రేజ్ దర్శక, నిర్మాతలకి భాగా ఉపయోగపడుతుంది.కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళీ బాషలలో కూడా సాయి పల్లవికి క్రేజ్ ఉండటంతో ఆమె తెలుగులో నటించిన సినిమాలని ఆయా బాషలలో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.సాయి పల్లవిని ముందు పెట్టి సినిమాకి ఆయా బాషలలో ప్రమోషన్ చేస్తున్నారు.ఆమెకున్న క్రేజ్ కారణంగా సినిమాకి ఓపెనింగ్స్ భాగా వస్తాయనే ఆలోచనతో నిర్మాతలు ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే ఆమె ప్రస్తుతం తెలుగులో నటిస్తున్న లవ్ స్టొరీ, విరాటపర్వం సినిమాలని తమిళ్, మలయాళీ బాషలలో కూడా రిలీజ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube