లారెన్స్‌కు సారీ చెప్పి మళ్లీ రంగంలోకి దించిన నిర్మాతలు  

Producers Says Sorry To Lawrence-kanchana,lawrence,laxmibomb,muni,ముని,లారెన్స్‌

సౌత్‌లో కొరియోగ్రాఫర్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోగా, దర్శకుడిగా మారిన లారెన్స్‌ ‘ముని’, ‘కాంచన’ వంటి హర్రర్‌ చిత్రాలతో స్టార్‌ డైరెక్టర్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. తాజాగా ఈయన తెలుగు మరియు తమిళంలో ‘కాంచన 3’ అనే చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ‘కాంచన’ హిందీ రీమేక్‌ ‘లక్ష్మీబాంబ్‌’ చిత్రం గురించి ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ చిత్రంకు లారెన్స్‌ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. అయితే లారెన్స్‌కు తెలియకుండా ఫస్ట్‌లుక్‌ను నిర్మాతలు విడుదల చేయడంతో వివాదం ఏర్పడింది..

లారెన్స్‌కు సారీ చెప్పి మళ్లీ రంగంలోకి దించిన నిర్మాతలు-Producers Says Sorry To Lawrence

తనను సంప్రదించకుండా ఎలా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు అంటూ లారెన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తాను రీమేక్‌ దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లుగా స్వయంగా ప్రకటించాడు. దాంతో ఆ సినిమాకు మరో దర్శకుడిని కూడా రంగంలోకి దించాలని భావించారు. అయితే అక్షయ్‌ కుమార్‌ మద్యవర్థిత్వం చేసి నిర్మాతలతో దర్శకుడు లారెన్స్‌కు సారి చెప్పించిన కారణంగా వివాదం సర్దుమనిగినట్లుగా తెలుస్తోంది.

లారెన్స్‌కు సారి చెప్పేందుకు నిర్మాతలు ఒప్పుకోవడంతో వివాదంకు తెర పడి మళ్లీ షూటింగ్‌ అతి త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒరిజినల్‌ వర్షన్‌కు దర్శకత్వం వహించిన దర్శకుడు లారెన్స్‌ అయితేనే లక్ష్మీబాంబ్‌ చిత్రాన్ని సరిగా చేయగలడు అనేది అక్షయ్‌ కుమార్‌ అభిప్రాయం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నిర్మాతల సారితో కరిగిన లారెన్స్‌ షూటింగ్‌ వచ్చేందుకు సిద్దం అయ్యాడు అంటూ బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.