ఫిదా చేసిన సాయి పల్లవి! ఒక్క మాటతో 40 లక్షలు వదులుకుంది  

Producers Like Sai Pallavi Behavior Once Again - Telugu Love Story Movie, Once Again, Producers, Sai Pallavi Behavior, Tollywood

ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులని తన వైపుకి తిప్పుకుంది.మొదటి సినిమాతోనే సౌందర్య మళ్ళీ వచ్చింది అనే స్థాయిలో అభిమానం సొంతం చేసుకుంది.

Producers Like Sai Pallavi Behavior Once Again - Telugu Love Story Movie, Once Again, Producers, Sai Pallavi Behavior, Tollywood-Movie-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు సాయి పల్లవి నటనకి ఫ్యాన్స్ అంటే అతిశయోక్తి కాదు.సీనియర్ నటులని కూడా మెప్పించిన ఈ జెనరేషన్ హీరోయిన్ గా సాయి పల్లవి అరుదైన గౌరవం సొంతం చేసుకుంది.

అయితే ఈ భామ అప్పుడప్పుడు తన వ్యక్తిత్వంతో కూడా అందరి అభిమానం సొంతం చేసుకుంటూ ఉంటుంది.

స్టార్ హీరోలతో సినిమాలు అయిన తన క్యారెక్టర్ నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా చేయనని చెప్పేసే సాయి పల్లవిని చాలా మంది దర్శకులు ఈ అమమయికి పొగరెక్కువ అనుకుంటారు.

కాని అది తన వ్యక్తిత్వం అని సాయి పల్లవి తాను ఎంచుకునే సినిమాల ద్వారా చెబుతుంది.తన మనసుకి నచ్చే సినిమాలు, కచ్చితంగా ప్రాత్ర ప్రాధాన్యత ఉన్న కథలే చేస్తానని స్పష్టం చేస్తుంది.

రెగ్యులర్ హీరోయిన్స్ తరహాలో డబ్బుల కోసం సినిమాలు చేయాల్సిన అవసరం తనకి లేదని పలు సందర్భాలలో చెప్పింది.నటించే అవకాశాలు వచ్చాయి.పడిపడి లేచే మనసు సినిమాలో సాయి పల్లవికి ఇవ్వాల్సిన పెండింగ్ 40 లక్షల రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాత రాగా రెమ్యునరేషన్ వద్దని చెప్పింది.తనకి డబ్బు ఎప్పటికి మొదటి ప్రాధాన్యత కాదని సదరు నిర్మాతకి చెప్పినట్లు తెలుస్తుంది.

ఎక్కువ సంపాదించడం వలన తాను ఎక్కువ తినేది ఉండదని, తనకి నచ్చితేనే సినిమా చేస్తానని కేవలం సినిమాకి ఆత్మసంతృప్తి ఉంటే చాలని చెప్పింది.

తాజా వార్తలు

Producers Like Sai Pallavi Behavior Once Again-once Again,producers,sai Pallavi Behavior,tollywood Related....