బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమాకి నిర్మాతలు కూడా రెడీ

నందమూరి కింగ్ బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ మూవీ చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ మెజారిటీ భాగం ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.

 Producers Fixed For Balakrishna And Anil Ravipudi Movie, Tollywood, Akhanda Movi-TeluguStop.com

వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.దానికి తగ్గట్లే రీసెంట్ గా రుద్ర ఉపాశకుడుగా బాలకృష్ణ లుక్ టీజర్ ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది.

రికార్డ్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది.ఈ టీజర్ తో మరోసారి వీరి కాంబినేషన్ లో పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీని చూడబోతున్నామనే విషయం ఆడియన్స్ కి అర్ధమైంది.

ఈ సినిమా తర్వాత క్రాక్ తో హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ మూవీ ఉంటుంది.

దీని తర్వాత మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుడుగా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది.

బాలకృష్ణ వందో సినిమాని అనిల్ రావిపూడితో చేద్దామని అనుకున్నారు.ఆ సమయంలో రామారావు టైటిల్ తో ఒక కథని కూడా అనిల్ బాలయ్యకి నేరేట్ చేసాడని తెలిసింది.

ఎందుకనో ఆ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదు.అయితే ఇప్పుడు అదే కథకి కాస్తా మార్పులు చేసి బాలయ్య ఇమేజ్ కి తగ్గట్లు మరింత బెటర్ గా ప్రెజెంట్ చేసి వినిపించడంతో వెంటనే ఒకే చెప్పాడని సమాచారం.

దీంతో అనిల్ నెక్స్ట్ బాలకృష్ణతో సినిమా చేయనున్నాడని కచ్చితంగా తెలుస్తుంది.ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించానున్నారని సమాచారం.

త్వరలో ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube