సోనూసూద్ ముందర క్యూ కడుతున్న దర్శక నిర్మాతలు…!  

sonusood, tollywood, hyderabad, lockdown , directors, producers - Telugu Directors, Hyderabad, Lockdown, Producers, Sonusood, Tollywood

ప్రపంచంలో ఎవరైనా సరే.ప్రస్తుతం ట్రెండ్ ఏ విధంగా నడుస్తోంది, ఎవరైతే పాపులర్ గా ఉన్నారో వారి వైపు అందరి కళ్ళు ఉంటాయి.

TeluguStop.com - Producers Director A Queue In Front Of Sonu Sood

ఇక అందులో సినిమా వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కొంత పాపులారిటీ ఏ వ్యక్తికైనా వచ్చిందంటే చాలు వెంటనే వారిని వారి సినిమాల్లో నటించాలని వారివెంట తెగ క్యూ కడుతుంటారు.

అయితే ఇలాంటి పాపులారిటీని కొంతమందికి బాగా క్యాష్ చేసుకోవడం కూడా తెలుసు.ఇక అసలు విషయంలోకి వెళితే… ఇప్పుడు అనేకమంది దర్శకనిర్మాతల కళ్లు బాలీవుడ్ యాక్టర్ సోనుసూద్ పై పడ్డాయి.

TeluguStop.com - సోనూసూద్ ముందర క్యూ కడుతున్న దర్శక నిర్మాతలు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

లాక్ డౌన్ సమయంలో అనేకమందికి తన సొంత డబ్బులతో సేవ చేసి అందరితో రియల్ హీరో అనిపించుకున్నాడు.

సోషల్ మీడియా సైతం సోను ని పొగడ్తలతో ముంచెత్తడంతో ప్రస్తుతం దర్శక నిర్మాతలు ఆయన వైపు క్యూ కడుతున్నారు.

కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో వలస రైతులకు ఆయన ఒక ఆపద్బాంధవుడిగా పేరుపొందిన సోను సూద్ కి ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక కోట్ల మంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు.రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు, వ్యవస్థలు చేయాల్సిన కొన్ని పనులను తాను ఒక్కడే చేసి అందరితో శభాష్ అనిపించుకున్న వ్యక్తి సోను సూద్.

అలాంటి వ్యక్తి తాజాగా లాక్ డౌన్ ముగిసిన తదుపరి మొట్టమొదటిసారి హైదరాబాదులో అడుగుపెట్టాడు.ఇలా అడుగుపెట్టిన సోనూసూద్ ను ఎయిర్ పోర్ట్ లోనే చాలామంది ఆయనను గుర్తించి సెల్ఫీలు దిగడానికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు.

ప్రస్తుతం ఆయన అల్లుడు అదుర్స్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఆయనకు అనేక ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.

కొత్త కొత్త కథలు కొత్త పాత్రలు అన్నీ కూడా ప్రస్తుతం సోను సూద్ను వెతుక్కుంటూ వస్తున్నాయి.

ఇకపోతే సోను వచ్చిన రెండు రోజుల్లోనే ఏకంగా ఆరు మంది దర్శకులు ఆయనకు కథలు వినిపించారని సమాచారం.ఇందులో కొన్ని సినిమాలలో విలన్ పాత్రలు ఉంటే, మరికొన్ని హీరోల క్యారెక్టర్లు ఉన్నాయని సమాచారం.

అయితే హీరోగా ఓ అగ్ర నిర్మాణ సంస్థతో కలిసి సినిమా మొదలవుతుందని టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం జోరందుకుంది.అంతేకాదు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నాలుగు సినిమాలకు పైగా విలన్ పాత్రలో సోనూసూద్ సైన్ చేశారట కూడా.

మంచి పనులకు ఈ గుర్తింపును ఇవ్వడం కావచ్చు లేకపోతే సోనుసూద్ కు ప్రజల్లో ఉన్న క్రేజి ఫాలోయింగ్ వల్ల దర్శక నిర్మాతలు వారి సినిమాల్లో ఆయనను తీసుకోవడానికి కారణం అని భావించవచ్చు కూడా.కాకపోతే ఈ లాక్ డౌన్ సమయంలో చేసిన పనుల కంటే ముందే ఆయనలో ఓ మంచి నటుడు దాగి ఉన్నాడన్న విషయం అందరికీ తెలిసిందే.

చూడాలి మరి ఇప్పుడు హీరోగా కూడా నటించి మెప్పించగలడో లేదో.

#Hyderabad #Lockdown #Sonusood #Directors #Producers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Producers Director A Queue In Front Of Sonu Sood Related Telugu News,Photos/Pics,Images..