నేను ఎక్కడ సంతకం పెట్టమంటే బండ్ల గణేష్ అక్కడ పెట్టేవాడు: నిర్మాత

Producer Vakada Appa Rao Talking About Bandla Ganesh

నిర్మాత వాకాడ అప్పా రావు .ప్రముఖ తెలుగు, హిందీ చిత్ర నిర్మాత.

 Producer Vakada Appa Rao Talking About Bandla Ganesh-TeluguStop.com

ఎన్నో అద్భుతమైన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి మంచి పేరును సంపాదించుకున్నారు.అంతే కాకుండా ఇటీవలి కాలంలో వచ్చిన ఖైదీ నం.150, సైరా నర్సింహా రెడ్డి సినిమాలకు ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించి మరో మెట్టు ఎదిగారు వాకాడ.ఇకపోతే తాను ఎప్పుడు ఎవరికి రుణం కలిగి ఉన్నా అది ఎంత కష్ట పడైనా తీరుస్తానని అప్పా రావు అన్నారు.

ఇలా ఇతరుల విషయంలో ఎంతో నిబద్ధతగా ఉండే నిర్మాత అప్పారావుకి ఒక సినిమా కోసం 7 కోట్లు ఇస్తానన్న ఫైనాన్షియర్, చివరికి చేతులు ఎత్తేశారని, ఆ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డానని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ బండ్ల గణేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Producer Vakada Appa Rao Talking About Bandla Ganesh-నేను ఎక్కడ సంతకం పెట్టమంటే బండ్ల గణేష్ అక్కడ పెట్టేవాడు: నిర్మాత-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే తనకు బండ్ల గణేష్ కు మధ్య సంబంధం చాలా బాగుంటుందని వాకాడ తెలిపారు.నాతో అతను ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని, తనని ఎప్పుడూ అన్నయ్యా, అన్నయ్యా అంటూ పలకరిస్తాడని ఆయన అన్నారు.తన కోసం ప్రత్యేకంగా ఒక గదిని, అందులో ఒక టేబుల్ కూడా ఉండేట్టు ఏర్పాటు చేశాడని ఆయన తెలిపారు.మొత్తంగా చెప్పాలంటే బండ్ల గణేష్ సర్వం తనకు వదిలిపెట్టాడు అని ఆయన చెప్పుకొచ్చారు.

ఒకానొక సందర్భంలో నేను ఎక్కడ సంతకం పెట్టు అంటే.ఏం మాట్లాడకుండా అక్కడ సంతకం పెట్టేవాడిని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇక డబ్బుల సంగతి పక్కన పెడితే తనకు చౌదరి లాగానే ఆయన కూడా తనకు చాలా మర్యాద ఇచ్చారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

#Khaidi #Bandla Ganesh #Vakada Appa Rao

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube