ఆ వార్తలు అవాస్తవం నిజం కాదంటున్న హీరో సూర్య  

కోలీవుడ్ లో స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు సూర్య.ఆకాశం నీ హద్దురా సినిమాతో సూర్య తాజాగా సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

TeluguStop.com - Producer Thanu Rubbishes Rumours About Vaadivasal

అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయడం వలన ఈ సినిమా కలెక్షన్ ఎంత అనేది తెలియలేదు కానీ థియేటర్ లో రిలీజ్ అయ్యుంటే ఖచ్చితంగా వంద కోట్లు దాటిపోయేది.నిర్మాత గాను ఈ సినిమాతో సూర్య అమెజాన్ ప్రైమ్ నుంచి మంచి ప్యాకేజీ తీసుకున్నాడు.

ఇక నిర్మాతగా తన భార్య జ్యోతిక లీడ్ రోల్ లో తెరకెక్కించిన సినిమాలు కూడా సూర్యకి లాభం తీసుకొచ్చాయి.ఇదిలా ఉంటే సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో జల్లికట్టు కథ నేపధ్యంలో వాడివాసల్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

TeluguStop.com - ఆ వార్తలు అవాస్తవం నిజం కాదంటున్న హీరో సూర్య-General-Telugu-Telugu Tollywood Photo Image

వాడివాసల్ అనే నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా ఆగిపోయిందనే టాక్ తాజాగా కోలీవుడ్ లో వైరల్ అవుతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాపై వస్తున్న రూమర్స్ కి నిర్మాత ఫుల్ స్టాప్ పెట్టాడు. కలైపులి యస్‌.థాను ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.సూర్య తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.వాడివాసల్‌ సినిమా ఆగిపోయిందని వచ్చిన వార్తల్లో ఎటువంటి నిజం లేదు.అసత్యపు వార్తలను నమ్మొద్దు.

ఈ సినిమాను త్వరలోనే ప్రారంభిస్తాం.కచ్చితంగా విజయం సాధిస్తాం అని థాను సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు.

దీంతో ఈ రూమర్స్ కి చెక్ పడినట్లు అయ్యింది.ఈ సినిమాని వచ్చే ఏడాది ఆరంభంలో మొదలు పెట్టె అవకాశం ఉందని తెలుస్తుంది.

ఇందులో ఆండ్రియా హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ సినిమా తర్వాత పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా పట్టాలెక్కుతోంది.

#Hero Surya #Kollywood #Vetri Maran

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Producer Thanu Rubbishes Rumours About Vaadivasal Related Telugu News,Photos/Pics,Images..