థియేటర్‌లు కనుమరుగవ్వనున్నాయట  

Producer Suresh Babu Comments On Cinima Theaters-future In Digital,mutiflex Cinima,producer Suresh Babu

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆమాటకు వస్తే ప్రపంచ వ్యాప్తంగా కూడా థియేటర్లు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా నిర్మాత సురేష్‌బాబు షాకింగ్‌ వ్యాఖ్యలు చేశాడు.ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల వారిని ఆశ్చర్యంకు ఆవేదనకు గురి చేస్తున్నాయి.మల్టీ ప్లెక్స్‌లకు కాకుండా సాదారణ థియేటర్లకు జనాలు వెళ్లే రోజులు పోయాయని, డిజిటల్‌ ఫ్లాట్‌ ఫార్మ్‌లపైనే సినిమాలు చూసేందుకు జనాలు ఆసక్తిగా ఉన్నారంటూ సురేష్‌బాబు షాకింగ్‌ వ్యాఖ్యలు చేశాడు.

Producer Suresh Babu Comments On Cinima Theaters-future In Digital,mutiflex Cinima,producer Suresh Babu Telugu Tollywood Movie Cinema Film Latest News-Producer Suresh Babu Comments On Cinima Theaters-Future In Digital Mutiflex

సురేష్‌బాబు వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే రాబోయే 10.20 ఏళ్లలో థియేటర్లు అన్ని కూడా గోదాములు గా మారిన ఆశ్చర్య పోనక్కర్లేదు.ఎందుకంటే థియేటర్లను మెయింటెన్‌ చేసేందుకు కనీసం డబ్బులు రావడం లేదని నిర్మాత సురేష్‌బాబు అన్నాడు.కరెంట్‌ బిల్లులు కట్టలేని పరిస్థితులు ఉన్న థియేటర్లు ఉన్నాయి.

అలాంటివి త్వరలోనే క్లోజ్‌ అవ్వనున్నాయి.అదే సమయంలో ప్రస్తుతం పర్వాలేదు అన్నట్లుగా నడుస్తున్న థియేటర్లు కూడా మెల్ల మెల్లగా ప్రాభవం కోల్పోతాయని అంటున్నాడు.భవిష్యత్తు మొత్తం కూడా డిజిటల్‌ ప్రపంచం అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవం ఉన్న సురేష్‌బాబు ఈ వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.