ప్రేక్షకులు వద్దనే వరకు సినిమాలు చేస్తా

టాలీవుడ్‌ లో సీనియర్ మోస్ట్‌ నిర్మాత ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో సురేష్ బాబు పేరు ముందు ఉంటుంది.దాదాపుగా అయిదు దశాబ్దాల సినీ అనుభవం ఆయన సొంతం.

 Producer Suresh Babu About His Film Production   Narappa,  News In Telugu , Prod-TeluguStop.com

ఆయన తండ్రి రామా నాయుడు ఉన్నప్పటి నుండే సినిమా నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటూ సురేష్‌ ప్రొడక్షన్స్ లో ఎన్నో వందల సినిమాలు నిర్మించడంతో పాటు డిస్ట్రిబ్యూట్‌ చేసిన సురేష్ బాబు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానంను దక్కించుకున్నారు.కాలంకు అనుగునంగా మారుతు సురేష్ బాబు సినిమాలు చేయడం వల్ల ఇన్నాళ్లు ఆయన సినిమాలు జనాలు చూస్తు ఉన్నారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా సురేష్ బాబు ఒక ఇంట్వర్యూలో మాట్లాడుతూ ఇంకా ఎన్నాళ్లు సినిమా లు చేసేది ఇంకా ఎన్నాళ్లు సినిమాల నిర్మాణంలో ఉండేది ఆయన క్లారిటీ ఇచ్చాడు.

సినిమా ను నేను నిర్మిస్తున్నాను అంటే వాటిని జనాలు ఆధరిస్తున్నారు.

2021 సినిమాలో నేను నిర్మించిన సినిమాలు జనాలు ఆధరిస్తే తర్వాత సంవత్సరం సినిమా చేస్తాను.అదే ఒక సంవత్సరంలో సినిమా లు చేస్తే వాటిని జనాలు తిరష్కరిస్తే మరోసంవత్సరం ప్రయత్నించి మళ్లీ విఫలం అయితే అప్పుడు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతాను అన్నాడు.

ఎప్పటి వరకు జనాల అభిరుచిని నేను అర్థం చేసుకుని సినిమాను చేస్తానో అప్పటి వరకు ఇండస్ట్రీలో ఉంటాను.అంటే ఎప్పుడైతే నేను ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమాను చేయలేక పోతున్నాను అనుకుంటానో అప్పటి నుండి సినిమా ఇండస్ట్రీలో నేను కనిపించను అంటూ సురేష్‌ బాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Telugu Ppa, Telugu, Ramanaidu, Suresh Babu, Suresh, Tollywood-Movie

ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది.సురేష్ బాబు మరో ఇరవై ఏళ్ల వరకు సినిమాలు తీయాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు.మరి అప్పటి వరకు సురేష్‌ బాబు సినిమాలు చేస్తాడా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube