హీరోలు పారితోషికం ఎందుకు తగ్గించుకోవాలి? నిర్మాత సునీల్ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున,సోనాల్ చౌహాన్ జంటగా నటించిన తాజా చిత్రం ది ఘోస్ట్.ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

 Producer Sunil Narang Hot  Comments On Heroes Remuneration  In Tollywood Sunil N-TeluguStop.com

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మాతలు సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావ్, శరత్ మరార్ ఈ సినిమాను నిర్మించారు.కాగా ఈ సినిమా దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ.

సినిమా టికెట్ రేట్ లపై హీరోలు రెమ్యూనరేషన్ లపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఈ నేపథ్యంలోనే హీరోల రెమ్యునరేషన్స్‌ పై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.హీరోల రెమ్యునరేషన్ తగ్గించుకోవాలన్న డిమాండ్ సరికాదు.ఎందుకంటే హీరోల డిమాండ్ ఉంటే ఎంతైనా ఇచ్చుకోవడం నిర్మాత వ్యక్తిగత నిర్ణయం.

పెద్ద హీరోలు ఉంటే రెమ్యునరేషన్ ఇవ్వాలి.కొత్త వారితో సినిమా తీస్తే ఫ్రీగా చేయించుకొంటాం అని సునీల్ నారంగ్ తెలిపారు.

Telugu Nagarjuna, Sunil, Ghost, Tollywood-Movie

మన దేశంలో 150 కోట్ల జనాభా ఉంది.అంత జనాభా నుంచి 2 వేల మంది హీరోలు కూడా లేరు.హీరోలే సినీ నిర్మాతకు కలెక్షన్లు తెప్పిస్తారు.ఆ హీరోలకు డిమాండ్ ఉంది కాబట్టే వాళ్లు రెమ్యునరేషన్ ఎక్కువ అడుగుతున్నారు.వారికి డిమాండ్ లేకపోతే వారు అడగరు.మేము కూడా ఇవ్వం అని సునీల్ నారంగ్ చెప్పుకొచ్చారు.

ది ఘోస్ట్ సినిమా విషయానికి వస్తే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన. టీజర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube