నిర్మాత తనయుడుని హీరోగా పరిచయం చేయబోతున్న శ్రీకాంత్ అడ్డాల- Producer Son Is A Hero In Srikanth Addala New Movie

Producer Son Is A Hero in Srikanth Addala New Movie, Tollywood, Telugu Cinema-Kuchipudi Vaari Veedhi Movie- Bunny Vaas- Chanti Addala -bhrhamosthavam-mahesh babu-bannivas - Telugu Bunny Vaas, Chanti Addala, Kuchipudi Vaari Veedhi Movie, Srikanth Addala New Movie, Telugu Cinema, Tollywood

సినిమా ఇండస్ట్రీలో వారసత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.స్టార్ హీరోల కొడుకులు హీరోలుగా మారిపోతూ ఉంటారు.

 Producer Son Is A Hero In Srikanth Addala New Movie-TeluguStop.com

అలాగే నిర్మాతల కొడుకులు కూడా హీరోలుగా ఎంట్రీ ఇస్తారు.అయితే అలా తెరంగేట్రం చేసిన వెండితెరపై తమ నటనతో మెప్పించి స్టార్స్ అనిపించుకున్న నటులు చాలా తక్కువ మంది ఉంటారు.

ఇలా సెలబ్రిటీ కుటుంబాల నుంచి స్టార్స్ గా మారిన నటులు గురించి చెప్పుకుంటే కొద్ది మంది మాత్రమే కనిపిస్తారు.అయితే మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం ఎక్కువ మంది హీరోలు వచ్చి ఇంచు మించు అందరూ కూడా సక్సెస్ అయ్యారు.

 Producer Son Is A Hero In Srikanth Addala New Movie-నిర్మాత తనయుడుని హీరోగా పరిచయం చేయబోతున్న శ్రీకాంత్ అడ్డాల-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే నిర్మాతల ఫ్యామిలీ నుంచి హీరోలుగా వచ్చిన సక్సెస్ అయిన వారిలో ఒక జగపతి బాబు కనిపిస్తారు.ప్రస్తుత తరంలో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపిస్తాడు.

తండ్రి నిర్మాత కావడంతో వారి తనయులు హీరోలుగా నిలబెట్టుకోవడానికి ఎంత ఖర్చైన పెట్టడానికి రెడీ అవుతారు.ఇది వారికి ఉన్న అద్వంతెజ్.

ఇప్పుడు ఇలా వారసత్వ హీరోల జాబితాలోకి మరో నిర్మాత తన తనయుడిని తీసుకోస్తున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ తో అల్లరి రాముడు, ప్రభాస్ తో అడవి రాముడు, చిరంజీవితో ఇద్దరు మిత్రులు సినిమాలు చేసిన నిర్మాత చంటి అడ్డాల.

ఇప్పుడు ఈ నిర్మాత తనయుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.అది కూడా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో.

కొత్త బంగారులోకం సినిమాతో దర్శకుడుగా అడుగుపెట్టిన శ్రీకాంత్ అడ్డాల మంచి టాలెంటెడ్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు తో బ్రహ్మోత్సవం సినిమాతో భారీ డిజాస్టర్ కొట్టాడు.

ఈ సినిమా తర్వాత నిర్మాత స్వయంగా మీడియాతో చాలా సందర్భాలలో శ్రీకాంత్ కూడా విమర్శలు చేశాడు.కనీసం కథ కూడా లేకుండా సినిమా చేసాడని, భారీగా ఖర్చు పెట్టిన్చాడని విమర్శలు చేశారు.

ఈ సినిమా ఎఫెక్ట్ తో శ్రీకాంత్ అడ్డాల ఇమేజ్ ఒక్కసారిగా పడిపోయింది.ఇక దాని నుంచి కోలుకోవడానికి అతను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో ఓ లో బడ్జెట్ మూవీ చేసి మళ్ళీ తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి బన్ని వాస్ శ్రీకాంత్ కి అవకాశం ఇచ్చాడు.కూచిపూడి వారి వీధి అనే టైటిల్ కూడా ఈ సినిమాకి ఫిక్స్ చేశారు.

ఈ ఏడాదిలోనే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.ఈ సినిమా కోసం చంటి అడ్డాల తనయుడిని శ్రీకాంత్ హీరోగా పరిచయం చేయబోతున్నాడు.

.

#SrikanthAddala #Bunny Vaas #KuchipudiVaari #Chanti Addala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు